BigTV English
Advertisement

Alcohol Side Effects: మద్యం హఠాత్తుగా మానేస్తే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా?

Alcohol Side Effects: మద్యం హఠాత్తుగా మానేస్తే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా?

మద్యం తాగడం వల్ల అనేక రకాల రోగాలు వస్తాయి. అలాగే వాటిని హఠాత్తుగా మానేసినా కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని కొత్త అధ్యయనం చెబుతోంది. 


మద్యం తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకే మధ్యాహ్నం మానేయాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తూ ఉంటారు. అయితే ఒక కొత్త అధ్యయనం మాత్రం మద్యపానం మానేసిన వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరిగినట్టు గుర్తించింది.

జపాన్లో పరిశోధకులు పదేళ్ల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 2012 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు 57 వేల మంది పై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో మద్యపాన అలవాటును కొనసాగించిన వారు, మానేసిన వారు కూడా ఉన్నారు. వారిద్దరిపై ఎలాంటి ప్రభావం కలుగుతుందో తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించారు.


చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది
ఆల్కహాల్ తాగేయడం హఠాత్తుగా మానేసిన వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం గుర్తించారు. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. సాధారణంగా ఆల్కహాల్ అనేది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మద్యం సేవించడం వల్ల మన శరీరంపై అనుకూలమైన మార్పులు చాలా తక్కువ ఉంటాయి. అయితే మొదటిసారి ఒక అధ్యయనంలో ఆల్కహాల్ మానేయడం మంచి పరిణామం కాదని వచ్చింది. దీనిపై లోతైన పరిశోధనలు అవసరం.

మద్యం ప్రతిరోజూ తాగే వారిలో ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మద్యం ఏ స్థాయిలో సేవించినా కూడా ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఇది వ్యాధులు, గాయాలు, అకాల మరణాలకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్లు, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మద్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా తక్కువ.

వచ్చే రోగాలు ఇవే
తరచూ మద్యపానం చేసే వారిలో డిప్రెషన్, మానసిక ఆందోళన వంటివి అధికంగా వస్తున్నట్టు ఎన్నో అధ్యయనాలు గుర్తించాయి. కానీ మొదటిసారి ఆల్కహాల్ మానేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్టు ఒక అధ్యయనం నిర్ధారించింది. కానీ దీని కోసం లోతైన పరిశోధనలు చేసి అప్పుడు ఒక నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది.

మద్యపానం చేసేవారిలో కాలేయం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఇది ఇతర మార్గాల్లో కూడా జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.  మద్యపానం తరచూ చేసేవారిలో బైపాలర్ డిజార్డర్, డిప్రెషన్, యాంగ్సైటీ, డిజార్డర్స్ పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

Also Read: ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగితే.. మతిపోయే లాభాలు !

ఈ కొత్త అధ్యయనం ఆల్కహాల్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెప్పినప్పటికీ ఇతర ప్రాణాంతక రోగాలు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకునే వారిలో రొమ్ము, పెద్ద పేగు, అన్నవాహిక, మెడ, తల, కాలేయం, పొట్ట, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా వీరిలో కాలేయ కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల సిర్రోసిస్ వంటి సమస్యలు రావచ్చు. అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, విచక్షణ రహితంగా మాట్లాడడం వంటివి చేస్తారు. ఆల్కహాల్ ప్యాంక్రియాస్ లో జీర్ణ ఎంజైముల నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల పాంక్రియాటైటిస్ వాపు అనే సమస్య వస్తుంది. ఇది కూడా ప్రమాదకరమే. కాబట్టి ఆల్కహాల్ అన్ని రకాలుగా ముప్పు తెచ్చేదే. ఆల్కహాల్ అలవాటును హఠాత్తుగా మానేయకుండా క్రమంగా తగ్గించుకుంటూ పూర్తిగా మానేయాలి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×