Tollywood:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఎంత లగ్జరీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందల కోట్ల ఆస్తులు ఉన్నా.. ఎంతోమంది సెలబ్రిటీలు భారీగా ఖర్చులు చేస్తూ తమ హుందాతనాన్ని, లగ్జరీతనాన్ని చూపించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వేలకోట్ల ఆస్తులు ఉన్నా సరే చాలా సింపుల్ గా కనిపిస్తారు. అయితే ఇక్కడ హీరోయిన్లే కాదు హీరోల భార్యలు కూడా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే ఇక్కడ ఒక స్టార్ హీరో భార్య ముందు యంగ్ హీరోయిన్లే కాదు సీనియర్ హీరోయిన్స్ కూడా తక్కువే అనే మాట వినిపిస్తోంది. మరి ఆ హీరో ఎవరు? ఆయన భార్య ఎవరు? అసలు ఏ విషయంలో హీరోయిన్స్ కంటే ఈమె ఎక్కువ ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు భార్య..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మంచు కుటుంబం(Manchu Family) కూడా ఒకటి. ఇక మంచు విష్ణు తండ్రి వారసత్వాన్ని ఉణికి పుచ్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు మంచు విష్ణు (Manchu Vishnu) భార్య విరానికా రెడ్డి (Viranika Reddy) కు సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి బయటకు రాగా.. అందులో ఆమె తన ఇష్టాలతో పాటు లగ్జరీ లైఫ్ గురించి కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈమె ముందు హీరోయిన్స్ కూడా తక్కువే..
ఇన్ని రోజులు మంచు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi) మీడియా ముందుకు వస్తోంది. కానీ మంచు కోడళ్ళు మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. కానీ తొలిసారి ‘కన్నప్ప’ ప్రమోషన్స్ లో భాగంగా Vishnu ) భార్య విరానికా కూడా మీడియా ముందుకు రావడం విశేషం. ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒకరకంగా పిచ్చి అని కూడా చెబుతాను. అందుకే నా దగ్గర అత్యంత కాస్ట్లీ బ్యాగ్ కూడా ఉంది. దాని విలువ సుమారు రూ.32 లక్షలు ఉంటుంది. అంతేకాదు నా వద్ద 200 వరకు బ్యాగులు ఉంటాయి. నాకు బ్యాగ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. అలాగే షూస్, బ్యాగుల పైన నేను ఎక్కువగా ఖర్చు పెడతాను” అంటూ తెలిపింది విరానికా.. ఇకపోతే ఈమె న్యూయార్క్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే అంతే కాదు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తుంది. అటు ఫ్యామిలీని కూడా చూసుకుంటోంది. ఇకపోతే విరానికా బ్యాగ్ కలెక్షన్ విషయంలో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా తక్కువే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు విష్ణు భార్య ఏకంగా రూ.32 లక్షల విలువైన బ్యాగు వాడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే సమంత, నయనతార లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా కేవలం రెండు లేదా 3 లక్షలకు మించి వారు ఇలా హ్యాండ్ బ్యాగ్ లకు ఉపయోగించరని, వారి కంటే ఈమె చాలా రెట్లు బ్యాగులకు ఖర్చు చేస్తోందని కూడా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి .
Kayadu Lohar: అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు వెంటపడుతున్నారు – డ్రాగన్ బ్యూటీ..!