Anakapalle Transgender Case: అనకాపల్లి హిజ్రా దీపు మర్డర్. ఇదేమీ మామూలు హత్య కాదు. పక్కా స్కెచ్. పర్‌ఫెక్ట్ ప్లానింగ్. చంపేసి.. బాడీని ముక్కలుగా నరికేసి.. వేరు వేరు ప్రాంతాల్లో పడేశాడు ఆ ఉన్మాది. ఏపీ పోలీసుల ముందు వాడి సినిమా తెలివితేటలు పని చేయలేదు. ఖాకీ స్టైల్ ఎంక్వైరీతో హంతకుడు బన్నీని పట్టేసుకున్నారు. విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి.
బన్నీ మరెవరో కాదు హిజ్రా దీపు లవరేనని తేలింది. వాళ్లు చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. దిలీప్ కుమార్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం సర్జరీ చేయించుకుని హిజ్రాగా మారాడు. దీపుగా పేరు మార్చుకున్నాడు. మునగపాక మండలం నాగులపల్లిలో ఉంటున్నాడు. ఆ ట్రాన్స్‌జెండర్ దీపును లవ్‌లో పడేశాడు బన్నీ. ప్రేమ పేరుతో ఆమెతో డేటింగ్ చేశాడు. దీపు నుంచి బాగా డబ్బులు కూడా దోచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత హిజ్రా దీపుపై మోజు పోయింది బన్నీకి. అప్పటికే అతను వేరే అమ్మాయితో లవ్‌లో పడ్డాడు. ట్రాన్స్‌జెండర్‌తో ఎఫైర్ జస్ట్ టైమ్‌పాస్‌కే.. ఖర్చులకు డబ్బుల కోసమే. తాను ప్రేమించిన మరో అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అప్పటి నుంచి హిజ్రా దీపును పట్టించుకోవడం మానేశాడు.
అప్పటికే బన్నీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దీపు.. తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేక పోయింది. బన్నీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని తెలిసి తల్లడిల్లిపోయింది. దీంతో దీపు, బన్నీల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలే ట్రాన్స్‌జెండర్. అందులోనూ లవ్ ఫెయిల్యూర్. ఆ హిజ్రా ఊరుకుంటుందా? తఢాఖా చూపడం మొదలుపెట్టింది. బన్నీ ఇంటికి ఎవరూ రాకుండా అడ్డుకునేది. బన్నీ ఇంటిముందు రచ్చ రచ్చ చేసేది. హిజ్రా హంగామా మామూలుగా ఉంటుందా?
Also Read : విదేశీ మహిళపై అత్యాచారం.. అరుణాచలంలో అపచారం
ఇదేదే తేడాగా ఉందని బన్నీ భయపడ్డాడు. హిజ్రా దీపుతో తనకు ఎప్పటికైనా కష్టాలేనని.. ఆమెను ఖతం చేయాలని డిసైడ్ అయ్యాడు. గత సోమవారం మధ్యాహ్నం దీపు మెడకు చున్నీ బిగించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేశారు. అదే రోజు అర్థరాత్రి.. బాడీ పార్ట్స్‌ను వేరు వేరు ప్రాంతాల్లో పడేశాడు.
నాగులపల్లిలో దీపును చంపేసి.. బైక్‌పై ఆమె బాడీ పార్ట్స్ తీసుకెళ్లి.. వాటిలో రెండు భాగాలను కసింకోట మండలం బయ్యవరంలో విసిరేశాడు. దీపు తలను అనకాపల్లిలో పడేశాడు. ఇక తనను ఎవరూ పట్టుకోలేరులే అనుకున్నాడు. కానీ, పోలీసులు తలుచుకుంటే ఎంతటి హంతకుడైనా తప్పించుకోగలడా? డెడ్ బాడీ పార్ట్స్ ఎవరివో తెలిసేందుకే కాస్త టైం పట్టింది. అది దీపు అని కన్ఫామ్ కాగానే.. ఫస్ట్ సస్పెక్ట్ బన్నీనే. ఇంకేం పోలీసుల పని ఈజీ అయిపోయింది. బన్నీని లోపలేసి.. ఖాకీ స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే.. ఇలా మొత్తం మేటర్ కక్కేశాడు. దీపు హత్యలో బన్నీకి ఇంకెవరైనా సహకరించారా అనే యాంగిల్‌లోనూ పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది. కేసు చిక్కుముడి వీడినా.. అనకాపల్లి హిజ్రా దీపు హత్య కేసు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సంచలనమే.