Star Heroine:సాధారణంగా సెలబ్రిటీలు ఎంత లగ్జరీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు వేలకోట్ల ఆస్తులు ఉన్నా సరే చాలా సింపుల్ గా కనిపిస్తారు.. మరి కొంతమంది సింపుల్గా కనిపించినా సరే.. వారు ఉపయోగించే ఆ వస్తువుల ఖరీదు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. తన బొడ్డు కోసం ఉపయోగించిన పుడక ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..మరి ఆమె తన నాభి కోసం పెట్టుకున్న ఆ పుడక ఖరీదు ఎంత? దాని ప్రత్యేకత ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
గ్లోబల్ స్టార్ గా మారిన ప్రియాంక చోప్రా..
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. మొదట తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అక్కడ కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి, తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె తన నటన డాన్స్ తో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్లో కాస్త ఇబ్బందులు తలెత్తడంతో ఏకంగా హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. అక్కడ పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు హాలీవుడ్ స్టార్ సింగర్ అయిన నిక్ జోనస్ (Nick Jonas) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు హాలీవుడ్లో భారీ ప్రాజెక్టులు చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది.
Vijay Deverakonda : అడ్డంగా ఇరుక్కున్న రానా, విజయ్ దేవరకొండ… కేసు నమోదు… త్వరలోనే అరెస్ట్..?
ప్రియాంక ధరించిన బెల్లీ బటన్ రింగ్ ఖరీదు ఎంతంటే..?
ఇక అలా హాలీవుడ్ లో వరుస సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీగా మారి.. కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న ప్రియాంక చోప్రా ఇటీవలే ఇండియాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే తన షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్న ఈమె నిన్న న్యూయార్క్ కి పయనమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి ముంబై.. అట్నుంచి న్యూయార్క్ బయలుదేరిన ఈమె ఆ విమానాశ్రయంలో చాలా లగ్జరీగా కనిపించింది. బ్లాక్ అండ్ బ్లూ కలర్ అవుట్ ఫిట్ ధరించి, బ్లాక్ గాగుల్స్ తో చాలా అందంగా కనిపించింది. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే.. ఆమె తన బొడ్డుకు ధరించిన రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ధరించిన ఆ బెల్లీ బటన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడమే కాకుండా దాని ఖరీదు సుమారుగా రూ.2.7 కోట్లని సమాచారం. ఇక దాని ఖరీదు ఎంతైతే ఆశ్చర్యపరుస్తుందో ప్రియాంక తన స్టైలిష్ లుక్కుకి ఈ డాజిలింగ్ లుక్ జోడించడం మరింత అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈమె తన లగ్జరీతనంతో అందరినీ ఆశ్చర్యపరిచింది .