E-Paper
Advertisement

Jana Sena Foundation Day: గిరిజన పల్లెల్లో జనసేనాని.. చిన్నారులతో పవన్ ముచ్చట్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

Jana Sena Foundation Day: గిరిజన పల్లెల్లో జనసేనాని.. చిన్నారులతో పవన్ ముచ్చట్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
Advertisement

Jana Sena Foundation Day: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించారు. రాజకీయ వేడుకలను ఆర్భాటాలకు పరిమితం చేయకుండా, గిరిజన బిడ్డల మధ్య గడిపి వారి అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడం ఈ ఏడాది ప్రత్యేకతగా నిలిచింది.

ముందుగా ఓనూరు జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా సుమారు 4 కిలోమీటర్ల మేర నిర్మించిన నూతన రోడ్డును ఆయన ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ఉపాధి హామీ పథకం నిధులతో ఈ రహదారులను నిర్మించారు. కొత్త రోడ్డుపై నడుస్తూ గిరిజన చిన్నారులతో పవన్ కళ్యాణ్ సరదాగా ఫోటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు.

Advertisement

ముఖ్య నేతల సమక్షం

ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస రావు, రాష్ట్ర జానపద కళలు , సృజనాత్మక అకాడమీ చైర్మన్ శ్రీ వంపూరు గంగులయ్య తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన ‘మాటామంతి’ కార్యక్రమంలో జనసేనాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అనుసరిస్తున్న 7 సిద్ధాంతాలు నేడు ప్రజాజీవితంలో విడదీయలేని భాగం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×