E-Paper
Advertisement

ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్

ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్
Advertisement

Amaravati: ఏపీలోని పట్టణ- స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కలెక్టర్లు, జిల్లా అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత గురువారం నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.

ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం

ఏపీలోని 100 అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 25వ వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఇచ్చే నివేదికలను పరిశీలించిన తర్వాత గురువారం నిర్ణయం వెల్లడిస్తామని ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

100 అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్

Advertisement

అప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయవద్దని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినా, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల తాత్కాలికంగా ఎస్ఈసీ నిలిపి వేసింది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వాయిదా వేయడానికి నిరాకరించింది. నామినేషన్ల దాఖలు చేసినప్పుడు అడ్డంకులు ఎదురైనట్లు ఫిర్యాదులు అందిన ప్రాంతాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచన చేసింది. ఈ క్రమంలో తాత్కాలికంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, రాజంపేట, పులివెందుల, బద్వేలు, ప్రొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు ఉన్నాయి. కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లో నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకున్నారని పిటిషన్‌ లో ప్రస్తావించింది వైసీపీ. ఈ క్రమంలో ఈనెల 25 వరకు అభ్యర్థుల జాబితా ప్రకటన నిలిపి వేసి ఫిర్యాదులపై గురువారంలోగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది.

ALSO READ: మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

Advertisement

ఈ వ్యవహారంపై ఏపీ ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా బుధవారం రాత్రి న్యాయ నిపుణులతో చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని రాత్రి 10.30 గంటల తర్వాత ప్రకటన చేశారు. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని తొలుత ఏడు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని సంకేతాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అందుకున్న తర్వాత.. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 28 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ప్రతి ఫిర్యాదు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related News

కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే..

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

అంతా డూప్‌తో బతకడమే వైసీపీ స్టైల్: ఆదినారాయణ రెడ్డి

చంద్రబాబు పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. రాజీనామా చేయాలంటూ ధర్మాన డిమాండ్

జగన్‌లాంటి వారు రాజకీయాలకే ప్రమాదం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మీది ఆరాటం.. మాది పోరాటం.. ఎన్నికల తీరుపై వైకాపా నేతల ఆగ్రహం!

Big Stories

Advertisement
×