E-Paper
Advertisement

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్
Advertisement

Pulivarthi Nani: చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని, అల్లర్లకు ముందే కుట్ర పన్నుతున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక చెవిరెడ్డి హస్తమే ఉందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి శ్రేణులపై దాడులు చేయించి, మళ్లీ ఆయనే కలెక్టరేట్ వద్ద దొంగ ధర్నాలు చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

అల్లర్లు, దాడుల వెనుక తుమ్మలగుంట ‘అపరిచితుడు’

Advertisement

ఎన్డీయే నేతలపై జరిగిన దాడులు చెవిరెడ్డి వేసిన ముందస్తు ప్రణాళికలో భాగమేనని నాని విమర్శించారు. స్వయంగా దాడులు చేయించుకుని సింపతీ పొందడం ఆయనకు అలవాటేనని, పార్టీలోని విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి వంటి పెద్దలను వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు పంపింది కూడా ఈ ‘తుమ్మలగుంట అపరిచితుడే’ అని వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి తన రౌడీయిజంతో చంద్రగిరిలో పరిశ్రమలు, విద్యాసంస్థలు రాకుండా అడ్డుపడుతూ నియోజకవర్గ అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెవిరెడ్డి ట్రాప్‌లో పడొద్దు

Advertisement

కూటమి కార్యకర్తలపై జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారికి వెల్లూరు, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. చెవిరెడ్డి మాటలు విని దాడులకు దిగి అక్రమ కేసుల్లో ఇరుక్కోవద్దని, ఆయన స్వార్థం కోసం మిమ్మల్ని బలిచేస్తారని హెచ్చరించారు.

ప్రజల రక్షణే నా ధ్యేయం

‘నేను ఎక్కడికీ పారిపోను, ఇక్కడే ఉంటాను. నా ప్రాణం అడ్డంగా పెట్టి అయినా చంద్రగిరి ప్రజలను, ఎన్డీయే శ్రేణులను కాపాడుకుంటాను’ అని పులివర్తి నాని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఎవరికీ భయపడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Also Read: నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

Tags

Related News

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

అంతా డూప్‌తో బతకడమే వైసీపీ స్టైల్: ఆదినారాయణ రెడ్డి

చంద్రబాబు పాలనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. రాజీనామా చేయాలంటూ ధర్మాన డిమాండ్

జగన్‌లాంటి వారు రాజకీయాలకే ప్రమాదం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మీది ఆరాటం.. మాది పోరాటం.. ఎన్నికల తీరుపై వైకాపా నేతల ఆగ్రహం!

చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

Big Stories

Advertisement
×