Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, మిస్సమ్మలను కలిపే విషయంలో రాథోడ్ హెల్ప్ అడుగుతారు పిల్లలు. అందుకు రాథోడ్ తానే చేయాలో తనకేం తెలియదని పిల్లలకు చెబితే.. రామాయణంలో రాముడిని సీతను కలిపేందుకు హనుమాన్ ఏం చేశారో నువ్వు అదే చేయ్ రాథోడ్ అని పిల్లలు చెబితే.. రాథోడ్ నేను అంత గొప్పవాడినా..? అంటాడు. అందుకు పిల్లలు రిక్వెస్ట్ చేస్తే.. హనుమంతుడి విగ్రహం చూస్తూ స్వామి నువ్వే మమ్మల్ని ముందుకు నడిపించాలి అంటూ మొక్కుతాడు. పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు.
ఆశ్రమంలో ఉన్న మనోహరి అలిసిపోయి నిద్ర పోవడానికి వెళితే పిల్లలు నిద్ర పోకుండా ముచ్చట్లు పెడుతుంటారు. అది చూసిన మనోహరి అబ్బా ఈ పిల్లలు ఇంకా నిద్రపోలేదు. నాకు స్పెషల్‌గా రూం ఇస్తారు అనుకుంటే ఇలా పిల్లల గదిలో పడేశారు అని బాధపడుతుంటే రాజు వెళ్లి ఏంటి మనోహరి పిల్లలు ఇంకా నిద్ర పోలేదు అని అడిగితే.. మనోహరి కోపంగా ఏంటి మనోహరి అంటున్నావు.. నిన్నటి దాకా మనోహరి గారు అనేవాడివి అంటుంది. అందుకు రాజు నేను నీకంటే వయసులో పెద్దవాడిని కదమ్మా నాకు ఈ పిల్లలు ఎలాగో నువ్వు కూడా అలాగే పైగా నువ్వు ఇక్కడ పెరిగిన దానివే అంటూ చెప్పగానే.. అంటే నేను ఇక్కడే పెరిగితే నాకు గౌరవం ఇవ్వవా..? అంటూ ప్రశ్నిస్తుంది.
సరస్వతి వెళ్తుంది. నువ్వే సాధించావని నీకు గౌరవం ఇవ్వాలి మనోహరి.. ఇది ఆశ్రమం ఇక్కడ అందరూ సమానమే త్వరగా పిల్లలను పడుకోబెట్టి నువ్వు త్వరగా పడుకో పొద్దున్నే చాలా పనులుంటాయి అని చెప్పగానే.. మనోహరి కోపంగా ఏంటి పడుకోబెట్టకపోతే తనను తీసుకొచ్చిన నన్స్‌కు కంప్లైంట్ చేస్తారా..? అని అడుగుతుంది. అందుకు సరస్వతి నన్స్‌కు మేము కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు మనోహరి అదిగో అక్కడున్న ఆ సీసీ టీవీ కెమెరాలో అమరేంద్ర గారు మొత్తం చూస్తుంటారు. తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే.. మనోహరి కోపంగా సరస్వతిని తిట్టుకుని పడుకోబెడతాను అంటూ ఏయ్ పిల్లలు త్వరగా పడుకోండి అంటుంది. అందుకు సరస్వతి ఏంటి మనోహరి పిల్లలను బెదిరిస్తున్నావా..? అసలు నిన్ను చిన్నప్పుడు నేను ఎలా పడుకోబెట్టేదాన్ని అంటుంది.
సరే పిల్లలు త్వరగా పడుకోండి.. అంటూ ప్రేమగా చెప్తుంది మనోహరి. పిల్లలు ఊరికే పడుకోమంటే ఎలా పడుకుంటాము అక్కా అంటారు. అందుకు మనోహరి మరి ఏం చేయాలి అని అడుగుతుంది. జోలపాట పాడమని పిల్లలు చెప్తారు. సరే పాడతాను మీరు పడుకోండి అని మనోహరి చెప్పగానే.. పిల్లలు పడుకుంటారు. మనోహరి పాట పాడగానే ఉలిక్కిపడి లేస్తారు. మనోహరి పాట విన్న సరస్వతి, రాజు షాక్ అవుతారు. పిల్లలు అక్కా నీ పాట ఆపేయ్ మేము నిద్రపోతాము అంటూ పడుకుంటారు. సరస్వతి నువ్వు కూడా త్వరగా పడుకుని ఉదయమే నిద్ర లేవాలి మనోహరి అని చెప్పగానే.. ఎందుకు ఉదయమే లేచి ఈ పిల్లలతో యోగా చేయించాలా..? అంటుంది మనోహరి. ఆ పని తాను చేస్తానని ఆశ్రమంలో పిల్లలకు టిఫిన్స్ చేయడం మనోహరి చూసుకోవాలని చెప్పి వెళ్లిపోతారు. మనోహరి ఇరిటేటింగ్ గా నేను చేయాలా..? అనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.