Brahmamudi serial today Episode: రేఖను అవమనించి అందరూ వెళ్లిపోతారు. చేసేది ఏమీ లేక రేఖ, భ్రమరాంబ, భూషణ్, శేషు లోపలికి వెళ్లిపోతారు. రేఖ టీవీ రిమోట్ పని చేయడం లేదని కోప్పడుతుంటే.. టైం బాగా లేకపోతే ఇలాగే అన్ని ఎదురు తిరుగుతుంటాయి అని శేషు అంటే రేఖ కోపంగా పనిమనిషి వసంతను పిలిచి కాఫీ పెట్టమంటే తన చేతి ఖాళీగా లేదని అపర్ణ, సుభాష్‌ల పెళ్లి రోజని స్పెషల్ వంటకాలు చేయమన్నారు అని చెప్తుంది వసంత. ఆ మాటలకు రేఖ కోపంతో రగిలిపోతుంది. భ్రమరాంబ కోపంగా వెళ్లి వెంటనే కాఫీ పెట్టు వెళ్లు అంటూ తిట్టగానే.. వసంత వెళ్లిపోతుంది. ఏంటి రేఖ ఈ ఇంట్లో నీకు రాను రాను విలువ లేకుండా పోతుంది అంటూ బ్రమరాంబ అనగానే.. చెప్పాను కదా భ్రమరం గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనం జీతమిచ్చి పెట్టుకున్నవాళ్లు కూడా మన మాట వినరు అని చెప్పగానే.. రేఖ కోపంగా చూస్తుంటుంది.
అపర్ణ, సుభాష్ గుడిలో అర్చన చేస్తారు. అపర్ణ దేవుడి ముందు నిలబడి ఇందు, రాజుల గురించి ప్రార్థిస్తుంది. వారి నిజమైన భార్యాభర్తలు అవ్వాలని సుఖశాంతులతో ఆయుఃఆరోగ్యాలతో నిండు నూరేళ్ల బతకాలని అపర్ణ ప్రార్థిస్తుంటే.. అది అంత సులభం కాదని ఒక స్వామిజీ వస్తాడు. ఆయన్ని చూసిన అపర్ణ కొంచెం భయంగానూ కొంచెం సంతోషంగానూ.. స్వామి మీరు ఎన్ని రోజులకు కనిపించారు.. అయినా ఏంటి స్వామి మీరు చెప్పేది అని అపర్ణ అడిగితే.. అవునమ్మా సత్యం వినడానికి చేదుగా ఉండొచ్చు కానీ ఆ సత్యమే రాబోయే ఆపదలను ముందుగానే తెలియజేసి ఆపద నుంచి మనుషులను గట్టెక్కిస్తుంది అంటూ చెప్పగానే..
సుభాష్ ఆందోళనగా గురువు గారు మీ మాటలు మాకు భయాన్ని కలిగిస్తున్నాయి. మా కుంటుంబానికి ఏదైనా ఆపద పొంచి ఉందా..? దయచేసి పూర్తిగా చెప్పండి గురువుగారు అని అడిగితే.. ఉంది సుభాష్ మీ వంశానికి వారసుడు అయిన రాజు జీవితాన్ని మృత్యువు నీడలా వెంటాడనుంది. తన ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ చెప్పగానే.. అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. ఏం చెప్తున్నారు గురువు గారు అని అపర్ణ అడిగితే.. అవునమ్మా రాజుకు మహా ప్రాణగండం పొంచి ఉంది అంటూ చెప్పగానే.. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండాలి కదా గురువు గారు దీనికి ఏ పరిస్కారం లేదా..? అని అడిగితే.. రాజుకు ఇందుకు వెంటనే పెళ్లి జరిపించాలి. ఇందు మాంగళ్య బలమే రాజును కాపాడుతుంది అని చెప్తాడు. ఇక అపర్ణ, సుభాష్ వెంటనే రాజుకు ఇందుకు పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు.
ఇందు, రాజు కారులో వెళ్తుంటారు. ఇందును రాజును తిడుతుంది. మనమే మన కంపెనీకి లేటుగా వెళితే పని చేసే ఎంప్లాయిస్ ఇంకా లేటుగా వస్తారు అంటూ తిడుతుంటే.. రాజు ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయి తన కారును పక్కకు ఆపేస్తాడు. అప్పుడే అపర్ణ ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడిగితే.. యమలోకానికి దగ్గర వెళ్లి వచ్చాను నాన్నమ్మ అంటుంది ఇందు. అపర్ణ మరింత భయంగా ఏం జరిగింది అని అడిగితే.. యాక్సిడెంట్ మిస్ అయిందని చెప్పగానే.. ఇందును వెంటనే ఇంటికి రమ్మని ఆఫీసు పని రాజుకు అప్పగించి వచ్చేయమని చెప్తారు. ఇందు సరే అంటుంది.
ఇంటికి వచ్చిన ఇందుకు అపర్ణ వెంటనే రాజును పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఎందుకని ఇందు అడిగితే.. గుడిలో స్వామిజీ చెప్పింది మొత్తం చెప్తుంది అపర్ణ. రాజు నీ మెడలో కట్టే తాళి వాడికి రక్షణ కవచం అవుతుంది. ఇందు నువ్వు ఏమీ ఆలోచించకు వాడి మనసులో నీ మీద ప్రేమ ఉందని నేను నమ్ముతున్నాను. నువ్వు అడిగితే కాదనడు అనే నమ్మకం నాకుంది. నువ్వే వెళ్లి వాడితో మాట్లాడి ఒప్పించవే అంటూ చెప్తుంది. ఇందు అలాగే నాన్నమ్మ బావను పెళ్లి చేసుకుని నా ప్రేమతో పాటు బావను రక్షించుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది.
ఇంట్లో ఉన్న రేఖ, భ్రమరాంబ, భూషణ్, శేషు అందరూ అవమానం జరిగిందని మాట్లాడుకుంటారు. ఇంట్లో గౌరవం దక్కాలంటే తామంటే భయం పుట్టాలని అందుకే ఇంట్లో పెద్ద తలకాయని లేపేస్తే అందరిలో భయం మొదలవుతుంది అంటూ రేఖ స్కెచ్ వేస్తుంది. సుభాష్‌కు రాజు తీసుకొచ్చే మెడిసిన్‌లో డోస్ ఎక్కువ ఇచ్చేలా చేయాలని అప్పుడు సుభాష్ చనిపోతాడని చెప్తుంది. అప్పుడే శేషు వెటకారంగా గ్రహాలు అసలు అనుకూలంగా లేవు ఇది మీకే తిప్పి కొడుతుంది అని చెప్పినా రేఖ వినకుండా శేషును తిట్టి వెళ్లిపోతుంది.
ఆఫీసుకు వెళ్లిన రాజు దగ్గరకు ప్రశాంత్ వెళ్లగానే.. రాజు వెటకారంగా మాట్లాడుతూ నీ శాలరీ కోత పెడతానని బెదిరిస్తాడు. అందుకు ప్రశాంత్ భయంతో రాజుకు సరెండర్ అవుతాడు. అప్పుడే వెంకీ వస్తాడు. తన కంపెనీలో జరుగుతున్న ప్రాడ్ గురించి ఆ ప్రాడ్‌తో ఐశ్వర్య కంపెనీ ఉన్న లింక్ గురించి చెప్తాడు. రాజు షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.