BigTV English

Crime: వ్యభిచార దందాలో ఎస్‌ఐ తల్లి, తమ్ముడు.. ఏపీలో కలకలం

Crime: వ్యభిచార దందాలో ఎస్‌ఐ తల్లి, తమ్ముడు.. ఏపీలో కలకలం

Crime: ఇది మామూలు న్యూస్ కాదు. ఖతర్నాక్ మేటర్. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉలిక్కిపడేలా చేసిన ఘటన. విషయం తెలిసి ఖాకీలే నోరెళ్లబెట్టారు. ఈ కేసుపై పోలీస్ శాఖలో అంతర్గతంగా విచారణ కూడా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ న్యూస్ ఏంటంటే….


తిరుపతి పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫలానా చోట వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందింది. ఖాకీలు క్రాస్ చెక్ చేసుకున్నారు. మేటర్ నిజమేనని కన్ఫామ్ చేసుకున్నారు. వన్ ఫైన్ డే ఆ వ్యభిచార గృహంపై దాడి చేశారు. అక్కడ తెలిసిన విషయం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏం తెలిసింది?

తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేయగా.. అక్కడ వ్యభిచారం జరుగుతున్న విషయం నిజమేనని తేలింది. ఇద్దరు యువతులను, ఓ విటుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దందా చేస్తున్న మహిళను, ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే ఖతర్నాక్ ట్విస్ట్ ఉంది.


యువతులను తీసుకొచ్చి.. విటులను ఆకర్షించి.. ఆ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళ.. ఓ ఎస్సై తల్లి అని తేలింది. అది కూడా మహిళా ఎస్సైనే అట. ఆ లేడీ ఎస్సై తల్లితో పాటు ఆమె తమ్ముడు కూడా ఇదే దందాలో ఉన్నాడు. అలా ఎస్సై తల్లి, తమ్ముడు కలిసి ఈ గలీజ్ దందా చేస్తున్నట్టు పోలీసులకు తెలిసి కంగుతిన్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.

ఆ మహిళా ఎస్‌ఐకి ఏడాది క్రితం వివాహం అయింది. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి వేరుగా ఉంటోంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో ఉంటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మరి, ఈ విషయం ఆ మహిళా ఎస్సైకి తెలుసా? ఆమెకు తెలిసే ఇదంతా జరుగుతోందా? ఈ దందాలో ఆమె ప్రమేయం కూడా ఉందా? లేదంటే, కుటుంబసభ్యులకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదా? ఇలా పూర్తి స్థాయి విచారణకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Governor : బిశ్వభూషణ్ కు ఏపీలో వీడ్కోలు.. గవర్నర్‌ వ్యవస్థకు నిండుదనం తెచ్చారు: సీఎం జగన్

Gannavaram : గన్నవరంలో 144 సెక్షన్.. విజయవాడలో టెన్షన్..టెన్షన్.. పట్టాభి ఎక్కడ..?

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×