BigTV English

Moon Festival:వారికోసమే ప్రత్యేకమైన ‘మూన్ ఫెస్టివల్’..

Moon Festival:వారికోసమే ప్రత్యేకమైన ‘మూన్ ఫెస్టివల్’..

Moon Festival:సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రోజురోజుకు అభివృద్ధి చెందుతుండడంతో అందరికీ దీనిగురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలయ్యింది. అందుకే కొన్ని కష్టమైన పరిశోధనలకు సంబంధించిన ప్రక్రియలు కూడా ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. అంతే కాకుండా మరికొందరికి కొన్ని విషయాలు దగ్గరగా చూసి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారికోసమే తమిళనాడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది.


చిన్నప్పటి నుండే సైన్స్ మీద ఆసక్తి ఏర్పడేలా చేస్తే.. పెద్దయ్యాక వారు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని ఈరోజుల్లో చాలామంది టీచర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుండే సైన్స్‌లోని చాలా విషయాలను వారికి క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. ఈ విషయంలో వారిని మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇందులో భాగమయ్యింది.

తమిళనాడు ఆస్ట్రానమీ సైన్స్ సొసైటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కలిసి ‘మూన్ ఫెస్టివల్’ను నిర్వహించనున్నాయి. ఫిబ్రవరీ 25 నుండి ప్రారంభం కానున్న ఈ ఫెస్టివల్.. నాలుగు రోజులపాటు జరగనుంది. స్కూల్ విద్యార్థులకు ఆస్ట్రానమీ, స్కైగేజింగ్ వంటివాటిలో ఆసక్తిని కలిగించడమే ముఖ్య లక్ష్యంగా ఈ మూన్ ఫెస్టివల్ ఏర్పాటయ్యింది.


తమిళనాడులోని 25 ప్రాంతాల్లో ఫిబ్రవరీ 25 నుండి 28 వరకు రాత్రి 6.30 నుండి 8.30 వరకు ఈ మూన్ ఫెస్టివల్ జరగనుంది. టెలిస్కోప్ ఉన్నవారిలో కొందరిని వాలంటీర్లుగా సెలక్ట్ చేసి విద్యార్థులకు ఆస్ట్రానమీ గురించి, సైన్స్ గురించి తెలియజేయాలని ఆర్గనైజర్లు ప్లాన్ చేస్తున్నారు. కేవలం సిటీల్లోనే కాదు.. కొన్ని గ్రామాల్లో కూడా ఈ ఫెస్టివల్ జరగనుంది. ఏ ఎంట్రీ ఫీజ్ లేకుండా విద్యార్థులకు ఈ మూన్ ఫెస్టివల్‌కు అనుమతించనున్నారు.

New Radar System:రేడియో ఆస్ట్రానమీలో కొత్త పరికరం.. తక్కువ ఖర్చుతో..

Key Tests:చంద్రయాన్ 3 అప్డేట్.. టెస్టులు పూర్తి..

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×