AP local body elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఈ విషయంలో వైసీపీ ఫెయిలైందా? కేవలం పులివెందుల, పుంగనూరు, రాయచోటి, కమలాపురం పురపాలికలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. కేవలం ఆ ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. రాష్ట్రమంతా నామినేషన్లు వేశాయి ప్రధాన పార్టీలు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో జగన్ ఫ్యామిలీ ఏకగ్రీవాలకు ఎక్కువగా మొగ్గు చూపేది. తొలిసారి ఆ ప్రాంతంలో ప్రత్యర్థుల జెండా రెపరెపలాడనుంది.
ఏపీలో స్థానిక సంస్థల వేడి తీవ్రమైంది. ఆదివారంతో నామినేషన్ల సందడి ముగిసింది. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయని దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు పురపాలక సంఘాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. ఇక గురజాల, కమలాపురం నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్లు కూటమి పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కడప జిల్లా దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట. పులివెందుల మొదలు దాదాపు సగానికి పైగానే మున్సిపాలిటీలు ఏకగ్రీవాలు చేసేది. ఈసారి సగం మున్సిపాలిటీలో నామినేషన్ వేయలేకపోయారు వైసీపీ నేతలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోట పుంగనూరులో నామినేషన్లు వేయకుండా డ్రాపైంది ఆ పార్టీ. ఈ విషయంలో జగన్ మాటలను ఆయన పెడ చెవిన పెట్టారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వవద్దని, అలా చేస్తే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ల ఇవ్వమని తేల్చేశారు జగన్. ఆ లెక్కన పెద్దిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేనట్టేనా?
వైఎస్ కుటుంబానికి కంచుకోటలుగా ఉండే పులివెందుల, పుంగనూరు, కమలాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో నామినేషన్ వేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.. ఆ పార్టీ నేతలు అభ్యర్థులను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఛైర్‌పర్సన్ స్థానానికి అభ్యర్థులు దొరకరని ఆ పార్టీ నేతలు కలలో కూడా ఊహించలేదు. గత ఎన్నికల్లో నాయకులపై బెదిరింపులకు పాల్పడి, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వందల సంఖ్యలో స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ, ఈసారి పరిణామాలు మింగుడుపడడం లేదు.
ALSO READ: విశాఖలో డేటా సెంటర్ల నీటి వినియోగంపై గూగుల్-అదానీ కీలక నిర్ణయం, కొత్తగా టెక్నాలజీ వినియోగం
కడప జిల్లాలో ఎర్రగుంట్ల, మైదుకూరు మున్సిపాలిటీలు, కమలాపురం నగర పంచాయతీ, అన్నమయ్య జిల్లా రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రకాశం జిల్లాలో దర్శి, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలు, గురజాల నగర పంచాయతీలో వైసీపీ తరపున అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయలేదు. కూటమి అభ్యర్థులు ఛైర్‌పర్సన్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కొంతమంది డమ్మీ అభ్యర్థులు తమతమ నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశం కూటమికి ఎక్కువగా ఉన్నాయి.