E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?

Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 19th: చందు వల్లిని మళ్లీ ఇంటికి తీసుకు వెళ్ళాలి అని భాగ్యం కండిషన్ పెడుతుంది.. అప్పుడే ఈ కేసును మేము ఆఫర్స్ తీసుకుంటాము లేదంటే కోర్టులోనే తెలుసుకుంటాం అని భాగ్యం అంటుంది. ఆ మాట వినగానే చందు జైల్లో అయినా ఉంటాను కానీ చచ్చిన దాన్ని నా ఇంట్లో అడుగుపెట్టనివ్వను. అసలు దాంతో కాపురం చేయను అని అనగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా జీవితంలోకి మళ్లీ దీన్ని తీసుకురాను అని చందు తేల్చి చెప్పేస్తాడు దానితో శ్రీవల్లి కూడా భయపడిపోతుంది. మరి నిజంగానే నన్ను ఇంకా కాపురం కి తీసుకుపోడు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

నర్మద దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

నర్మదా నేను శ్రీవల్లితో కొద్దిసేపు మాట్లాడాలి ఆ తర్వాత కోర్టుకు వెళ్దామని  అంటుంది. బయటికి తీసుకెళ్లిన శ్రీవల్లితో నర్మదా నువ్వు ఏం కోల్పోతున్నావో అని మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనిషిలాగ ఆలోచించు పెట్టి కోట్లు తేల్చుకుంటే అత్తయ్య మామయ్య నిన్ను జీవితంలో మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనివ్వరు. నువ్వు వెనక కేసు వాపస్ తీసుకుంటే వాళ్లే తన కొడుకు జీవితం బాగుపడుతుంది అని మళ్లీ నేను ఇంటికి తీసుకొస్తారు నీకు ఏది కావాలో నువ్వే ఆలోచించుకొని నర్మదా అంటుంది. ఇక మళ్ళీ ఈ కేసును వాపస్ తీసుకుని రెడీ అవుతుంది. భాగ్యం నా కూతురిని తీసుకొని వెళ్ళిన తర్వాతే కేసు వాపస్ తీసుకుంటాము అని చెప్తుంది. కానీ వేదవతి మాత్రం మాటకు మాట సమాధానం చెబుతుంది. నీ కూతుర్ని నా ఇంట్లో నుంచి గెంటేసామో మళ్లీ ఎలా తీసుకుని వెళ్తాము నీ కూతురు చేసిన మోసాలు ఏంటో మాకు తెలియదని వేదవతి అంటుంది.

వల్లి మాటతో షాక్..

Advertisement

నా కూతుర్ని మళ్ళీ మహారాణి లాగా తీసుకొని వెళ్ళాలి అని భాగ్యం అందరికీ వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతుంది. కానీ వేదవతి మాత్రం నీ కూతుర్ని ఇక నా ఇంటి గడప కూడా తొక్కనివ్వను మీరు చేసిన మోసాలు మీరు తీసిన పరువు వల్ల మేము తలుచుకోలేకపోతున్నాము అని వేదవతి అంటుంది. పదండి అయితే కోర్టులోనే మేము తేల్చుకుంటాము అని భాగ్యం అందరికీ షాక్ ఇచ్చేలా మాట్లాడుతుంది కానీ వల్లి మాత్రం అక్కర్లేదు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అయితే నేను ఈ కేసును వాపు తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వల్లి మాటలు విని భాగ్యం కూడా షాక్ అవుతుంది. ఇక వల్లి ఎస్ఐ గారు నన్ను ఎవరు కొట్టలేదు ఇది చేయలేదు నేను ఈ కేసును వాపస్ తీసుకుంటున్నాను అని అనగానే ఎందుకు పోలీసులు తప్పుదోవ పట్టించారు అని ఎస్ఐ సీరియస్ అవుతుంది కానీ మళ్ళీ మాత్రం కేసును వెనక్కి తీసుకుంటుంది.

వల్లికి విడాకులు..

రామరాజు వాళ్ళు ఇంటికి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు కానీ రామరాజు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. కూతురు లాగా చూసుకున్న కోడలు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి మేము రాచిరంపాలు పెడుతున్నాము అని అంటుందా. అస్సలు ఊరుకునేదే లేదు అని అనుకుంటూ ఉంటారు అయితే అప్పుడే చందు లోపలి నుంచి వచ్చి నాన్న మీరు ఈ విషయాన్ని ఒక మచ్చలాగా మర్చిపోండి. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచించకండి అని అంటాడు. అయితే నేను వల్లికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. చందు కి ఎంతగా చెప్పాలని చూసినా కానీ చందు మాత్రం అస్సలు వినడు.

ధీరజ్ కోసం అండ..

Advertisement

ధీరజ్ కి తన ఫ్రెండు ఫోన్ చేసి ట్రావెల్ బిజినెస్ లోకి అడుగు పెట్టాలనుకున్నావు కదరా ట్రావెల్ కంపెనీ వేలంలో పాట పాడుతున్నారు నువ్వు కూడా ఆ పాటలో పాల్గొని దాన్ని సొంతం చేసుకుంటావా అని అడుగుతాడు. అయితే ఇప్పుడు వద్దులేరా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను అది తీసుకోవడం మంచిది కాదు అని ధీరజ్ అంటాడు అయితే దాని గురించి ఇంట్లోనే వాళ్ళందరూ అడుగుతారు. నీకు ట్రావెల్ బిజినెస్ పెట్టాలని ఆశ ఉంది కదరా అని అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని ధీరజ్ అంటాడు. ఏం పర్వాలేదు నువ్వు ఎలాగైనా సరే బిజినెస్ పెట్టుకోవాలి అని రామరాజు తో సహా ఇంట్లోని వాళ్ళందరూ కోరుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..

Related News

Podarillu Today Episode : జమున కన్నాను తీసుకుపోతుందా..? డబ్బులు కొట్టేస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..!

Brahmamudi Serial Today Episode October 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెట్టిన పోటీలో ఐశ్వర్య గెలుస్తుందా..?   

Monday TV Movies : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తీసుకెళ్లిన నన్స్ ఎవరు..? ఎవరు పంపిస్తే వచ్చారు..?

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

Big Stories

Advertisement
×