E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన శివనారాయణ 

Karthika Deepam 2 Serial Today Episode October 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన శివనారాయణ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: దక్షిణమూర్తి, సూరజ్‌, మాలిని కలిసి భోజనం చేస్తుంటారు. ఇక జ్యోత్స్న ఆఫీసుకు రాదని సూరజ్‌ చెబితే అలా అని జ్యోత్స్న నీతో చెప్పిందా అని దక్షిణమూర్తి అడుగుతాడు. రావొద్దని వాళ్ల ఇంటి దగ్గర వాళ్ల ముందే చెప్పి వచ్చాను ఇంకా జ్యోత్స్న ఆఫీసుకు వస్తుందని తాను అనుకోవడం లేదని.. జ్యోత్స్న రావాలనుకున్నా ఇంట్లో వాళ్లు పంపించరు అని సూరజ్ చెబితే.. జ్యోత్స్న రాను అని అయితే చెప్పలేదు కదా అని దక్షిణమూర్తి అంటే.. జ్యోత్స్న వస్తానన్నా శివనారాయణ బాబాయ్‌ పంపించడు మామయ్య. జ్యోత్స్న మన ఆఫీసులో పని చేస్తే మన కాళ్ల దగ్గర పని చేసినట్టు ఫీలవుతాడు అని మాలిని చెప్పగానే.. దక్షిణమూర్తి కోపంగా జ్యోత్స్న ఆఫీసుకు రాకూడదనే కదా నువ్వు కోరుకునేది అంటూ భోజనం మధ్యలోంచి లేచివెళ్లిపోతాడు. తాత వెళ్లిపోయాడని సూరజ్‌ వెళ్లిపోతాడు. మాలిని మాత్రం సూరజ్‌కు తన మీద అనుమానం రాలేదులే అనుకుంటుంది. మామయ్యకు అనుమానం వచ్చిందేమో వస్తే రాని అనుకుంటుంది మాలిని.

జ్యోత్స్ను కూడా సుమిత్ర నిలదీస్తుంది. మాలిని ఇంటికి ఎందుకు వెళ్లావు అని ప్రశ్నిస్తుంది. అందుకు జ్యోత్స్న వాళ్లను ఇంకోసారి మన మీదకు రావొద్దని చెప్పడానికి అంటే సూరజ్‌ దగ్గరకు ఇక పీఏగా కూడా చేయోద్దని దశరథ, శివనారాయణ చెప్తారు. అందుకు జ్యోత్స్న వినదు. ఆ విషయం తప్ప మీరేం చెప్పినా వింటానని ఎందుకంటే నేనో జాబ్‌ చేస్తుంటే.. మాలిని అత్త తీసేయించింది. అదే కాకుండా నాకు ఎక్కడా జాబ్‌ రాకుండా చేసింది అందుకే అక్కడ జాబ్‌లో చేరాను అని చెప్పగానే.. అది మన ఆఫీసు కాదు జ్యోత్స్న అని సుమిత్ర అంటే మనది అవుతుంది. అంటూ జ్యోత్స్న ఆఫీసుకు టైం అవుతుంది వెళ్తున్నాను అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

దీంతో సుమిత్ర ఎమోషనల్ అవుతూ దీప నువ్వే జ్యోత్స్నను ఆపాలి అంటుంది. దశరథ, దీప దగ్గరకు వెళ్లి నువ్వు జ్యోత్స్న అక్కడ జాబ్‌ మానేస్తే నిన్ను నా పెద్దకూతురు అనుకుంటాను అంటాడు. సుమిత్ర కూడా దీప నువ్వు నా పెద్ద కూతురు అయినప్పుడు జ్యోత్స్న నీకు చెల్లి అవుతుంది. నీ చెల్లి జీవితాన్ని నువ్వే బాగు చేయ్‌ అంటుంది. శివనారాయణ ఏకంగా జ్యోత్స్నను అక్కడ జాబ్‌ చేయకుండా ఆపేస్తే మిమ్మల్ని క్షమిస్తానని సూరజ్‌కు మీకు ఏ సంబంధం లేదని నమ్ముతానని చెప్తాడు.

కార్తీక్‌, దీప బాధపడుతుంటారు. జ్యోత్స్నను అపితే మనకు మన వాళ్లు దగ్గరవుతారు. కానీ జ్యోత్స్న ఇప్పుడు మనం చెబితే వింటుందా..? అసలు వినదు.. తను ఏం చేయాలనుకుందో అదే చేస్తుంది అంటూ దీప బాధపడుతుంటే.. కార్తీక్‌ మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావ ఆలోచిస్తున్నావు.. ఏం పలకడం లేదు అని దీప అడిగితే.. దీప నీకు ఏదైనా బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటావు.. అని అడిగితే.. నీకే బావ అంటుంది దీప. మరి నాకు బాధ వస్తే అని కార్తీక్‌ అడిగితే.. నాకు చెప్పుకుంటావు బావ అంటుంది. మరి జ్యోత్స్నకు ఎవరున్నారు ఎవరూ లేరు ఎంత బాధొచ్చిన్నా తనలో తానే కుమిలిపోతుంది.

Advertisement

మనం మన జీవితం కోసం జ్యోత్న్సను ఆపితే తను అనుకున్నది జరగదు. తనకు ఓ జీవితం ఉంది కదా..? పైగా జ్యోత్స్నది మనది ఒకటే లక్ష్యం అంటూ కార్తీక్‌ చెబుతుంటే.. అది సరే కానీ బావ జ్యోత్స్న పాత మనిషిలా మారిపోయి సూరజ్‌ కుటుంబం మీద రివేంజ్‌ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే అని దీప అనుమానపడితే అలా ఏం చేయదని కానీ ఇక జ్యోత్స్న, సూరజ్‌ల ప్రేమకు ఇక్కడితో పులిస్టాప్‌ పెట్టాలి అంటాడు కార్తీక్‌. అదైతే నువ్వే చేయాలి బావ జ్యోత్స్ను ఆఫీసుకు వెళ్లకుండా ఆపేయ్‌ బావ అని చెప్తుంది దీప. సరే అంటూ కార్తీక్‌ వెళ్లి జ్యోత్స్నను ఆపేస్తాడు. నీతో మాట్లాడాలి అంటూ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అయ్యో.. బాలుకు ఎంత కష్టం వచ్చింది.. ఫ్యాన్స్ హర్ట్..

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. నారాయణకు మహా సపోర్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో.. రౌడీలతో రచ్చ.. ఆరాధ్య కిడ్నాప్.. పల్లవి ప్లాన్ ఇదా..

Brahmamudi Serial Today Episode October 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషుకు కంపెనీలో ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇందు

Wedensday TV Movies : బుధవారం టీవీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×