E-Paper
Advertisement

వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు

వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు
Advertisement

Amaravati: వైసీపీలో ఏం జరుగుతోంది? ఎందుకు అధినేత జగన్ టెన్షన్ పడుతున్నారు? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా, బెంగుళూరులో ఎందుకు మకాం వేశారు? బుధవారం నుంచి మూడురోజులు పులివెందులకు వెళ్లాల్సిన ఆయన, బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు ఎందుకు వస్తున్నారు? ఏమైనా కొత్త పరిణామాలు జరగబోతున్నాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్?

ఎన్నికల కంటే రాజకీయ పార్టీలకు ఏదీ ముఖ్యం కాదు. వాటి కోసం ఐదేళ్లు కళ్లు కాయలు కాసేలా చూస్తుంటాయి. అలాంటిది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఓ వైపు నామినేషన్లు తతంగం నడుస్తోంది. అయినా సరే వైసీపీ అధినేత జగన్ బెంగుళూరులో మకాం వేశారు. వారంలో ఒక రోజు విజయవాడకు రావడం, మీడియా సమావేశం పెట్టడం, గవర్నర్‌ను వెళ్లి కలవడం చేస్తున్నారు. జగన్ మకాం వెనుక ఏదో జరుగుతోందని అంటున్నారు చాలామంది నేతలు.

బెంగుళూరు నుంచి విజయవాడకు జగన్?

Advertisement

బుధవారం నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీల నామినేషన్ల ఘట్టం మొదలుకానుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు పులివెందులలో మకాం వేస్తారని తొలుత వార్తలు వస్తాయి. మరి ఏం జరిగిందో తెలీదుగానీ పులివెందుల టూర్ రద్దు అయినట్టు వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. బెంగుళూరు నుంచి నేరుగా విజయవాడకు జగన్ రానున్నట్లు సమాచారం.

ఉన్నట్లుండి జగన్ టూర్ రద్దు వెనుక ఏం జరుగుతోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బుధవారం తాడేపల్లిలోని నివాసంలో పార్టీ నేతలతో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అందులోని సారాంశం. పులివెందుల టూర్ రద్దు చేసుకుని, అత్యవసరంగా విజయవాడకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

ALSO READ: చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

కొన్నాళ్లుగా కాక్రోచ్ పార్టీకి జగన్ మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ హయాంలో జరిగిన అవకతవకల అన్ని కేసుల్లోనూ ఈడీ ఎంటరైంది. మరోవైపు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి రోజువారీ విచారణ చేపట్టాలని, నిందితులంతా న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఎలాంటి సమాచారం వచ్చిందో తెలీదు. మొత్తానికి వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ బయట బలంగా వినిపిస్తోంది.

Related News

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

శ్రీకాకుళంలో ఘోర విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు విద్యార్థులు.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×