E-Paper
Advertisement

Arava Sridhar Issue: క్లైమాక్స్‌కి అరవ శ్రీధర్ ఇష్యూ.. పవన్ గారూ నాకు సాయం కావాలి, కంటతడి పెట్టిన వీణ

Arava Sridhar Issue: క్లైమాక్స్‌కి అరవ శ్రీధర్ ఇష్యూ.. పవన్ గారూ నాకు సాయం కావాలి, కంటతడి పెట్టిన వీణ
Advertisement

Arava Sridhar Issue: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంతర్గత వ్యవహారం క్లైమాక్స్‌కి చేరిందా? సీరియల్ మాదిరిగా  శ్రీధర్-వీణ వ్యవహారం నెలరోజులపాటు సాగిందా? చివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయం కోరింది బాధితులు. తన ఆవేదనను బయటపెడుతూ ఒంటరిగా మిగిలిపోయానంటూ కంటతడి పెట్టింది. దీనికి సంబంధించి 10 నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేసింది.

క్లైమాక్స్‌కి అరవ శ్రీధర్ ఇష్యూ.. బాధితురాలు వీణా మరొక వీడియో

Advertisement

అరవ శ్రీధర్-వీణ అంతర్గత వ్యవహారానికి నెలరోజులు అయ్యింది. ఇప్పటివరకు ఏ విషయం తేలలేదు. ఫలితంగా నియోజకవర్గం ఎమ్మెల్యేని ఓ వైపు ప్రశ్నిస్తూనే, తనకు న్యాయం చేయాలంటూ ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొర పెట్టుకుంది. తనకు తప్పకుండా న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు ఆ వీడియోలో ప్రస్తావించింది బాధితురాలు.

తన వ్యవహారం మొదలై ఇప్పటికి నెల రోజులు గడుస్తున్నా జనసేన కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదని అరవ శ్రీధర్ బాధితురాలు వీణ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉండి పోరాడుతున్నానని, తనకు ఎవరూ న్యాయం చేయలేదని పేర్కొంది. ఇకపై తాను ఆత్మహత్య చేసుకుంటానని అందులో ప్రస్తావించింది.

Advertisement

పవన్ గారూ.. తనకు సాయం కావాలంటూ కంటతడి పెట్టిన వీణ

ఈ విషయం పార్టీకి సంబంధం లేదని కొందరు నేతలు అంటున్నారని, అసలు పార్టీ లేకుంటే శ్రీధర్ ఉండేవాడు కాదని ప్రస్తావించింది బాధితురాలు. మీరిచ్చిన అధికారంతో శ్రీధర్ ఇంత దారుణానికి ఒడిగట్టారని, అతడు ఎవరో తనకు తెలీదని తెలిపింది. ఆయన సర్పంచ్ గా ఉన్న మూడేళ్లు తాను కోడూరులో ఉన్నానని, అప్పుడు ఆయన ఎవరో తనకు తెలీదని గత విషయాలు బయపెట్టింది.

శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటారని చెప్పడంతో నమ్మానని, చివరకు మోసపోయానని మనసులోని ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికారంలోకి ఉండడంతో అతనికి సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ప్రభుత్వంపై ఉన్న నమ్మంతో తాను బయటకు వచ్చానని, వ్యవస్థ తనకు న్యాయం చేస్తుందని భావించానని తెలిపింది. ఈ వ్యవహారంపై చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానించారని తెలియజేసింది.

ALSO READ: వచ్చేవారం ఆర్సెలాల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ, మోదీ హాజరయ్యే ఛాన్స్

ఈ వ్యవహారం బయటకు వచ్చి నెల రోజులు అవుతుందని, అన్ని ఆధారాలు బయటపెట్టానని వెల్లడించింది వీణా. అధికారంలో ఉన్నవారు న్యాయం చేయలేనప్పుడు.. ప్రతిపక్షం సాయం కోరడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారామె. తప్పు చేసినవారు క్రికెట్ ఆడుతున్నారని, ఏ తప్పు చేయని తాను ఫ్యామిలీకి దూరం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాయం కోరారు బాధితురాలు వీణా. కడప జిల్లాలో ఓ ఎంపీడీఓ ఆత్మహత్యకు ప్లాన్ చేస్తే వెంటనే మీరు వచ్చారని, మీరు మా రాష్ట్రంలో ఉండడం గర్వంగా భావించినట్టు తెలిపారు. తనకు సాయం చేయాలని ఆమె వేడుకుంది. తప్పు చేసినవారికి పార్టీ జెండా ఇచ్చి వారిని ఎంకరేజ్ చేస్తే.. మహళలకు ఇంకేమి భద్రత ఉంటుందని అన్నారు. తప్పు చేసినవారికి కచ్చితంగా శిక్ష వేయాలని, న్యాయం చేయాలని కోరింది. న్యాయం చేయకుంటే తనకు ఆత్మహత్య శరణ్యమని మనసులోని బాధను వెళ్లగక్కింది.

 

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×