Kris Srikkanth On Ramesh Powar: టీమిండియాలోనే అడ్రస్ లేనోడు…అలాంటోడు సెలెక్టరా ? అంటూ కొత్త బీసీసీఐ సెలక్టర్ రమేష్ పొవార్ పరువు తీశాడు క్రిస్ శ్రీకాంత్. టీమిండియా సీనియర్ మెన్స్ టీం చీఫ్ సెలెక్టర్ గా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా నియామకం అయ్యాడు. ఆ పదవి కోసం పోటీ పడిన రమేష్ పొవార్ కు సెలక్షన్ కమిషన్ సభ్యుడిగా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. అయితే రమేష్ పొవార్ సెలెక్షన్ కమిషన్ సభ్యుడిగా అవకాశం రావడంపై క్రిస్ శ్రీకాంత్ స్పందించారు. టీమిండియాలోనే స్థానం కోసం పోరాడిన రమేష్ పొవార్ కు సెలెక్టరు పదవి ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు. అసలు బీసీసీఐకి కొంచెం కూడా బుర్ర లేదంటూ ఫైర్ అయ్యారు. దీంతో రమేష్ పొవార్ పై కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అజిత్ అగార్కర్ స్థానంలో చీఫ్ సెలెక్టర్ గా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా నియామకం అయ్యాడు. ఆ పదవి కోసం పోటీ పడిన రమేష్ పొవార్ కు సెలక్షన్ కమిషన్ సభ్యుడిగా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. దీనిపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహించారు. టీమిండియాకు ఏం ఒరగబెట్టాడని రమేష్ పొవార్ ను సెలక్టర్ గా తీసుకుంటారని నిలదీశాడు. ఒక్క మ్యాచ్ అయిన టీం ఇండియాను ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు ఉన్నాయా ? అంటూ ప్రశ్నించారు. టీమిండియాను ఒక్కసారి కూడా గెలిపించని వాళ్లకు పదవులు ఇస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవేళ టీమ్ ఇండియా సెలెక్టర్ గా రమేష్ పొవార్ బాధ్యతలు తీసుకుంటే… క్రికెట్ అభిమానులు తిరగబడతారని హెచ్చరించారు. అంతేకాదు ఇలాంటి వాళ్లు సెలెక్టర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి వాళ్లను పక్కకు పెడితే, పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అజిత్ అగార్కర్ కంటే ఎక్కువగా రమేష్ పొవార్ విమర్శల పాలు అవుతాడని హెచ్చరించారు. టీమిండియాలో ఎక్కువ కాలం లేని రమేష్ పొవార్ లాంటివాళ్ళు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని తీసేస్తారంటేనే అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
టీమిండియా కోసం కష్టపడ్డ వాళ్లు.. ఏదో ఒక ఫార్మాట్ లో అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టిన వాళ్లకు సెలక్టర్ల పదవి ఇవ్వాలని కృష్ణమాచారి శ్రీకాంత్ కోరారు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వాళ్లకు అలాంటి బాధ్యతలు ఇస్తే టీమిండియా స్థాయి మరింత పెరుగుతుందని తెలిపారు. నిజంగానే మహేంద్ర సింగ్ ధోనీ అని పిలిచి చీఫ్ సెలెక్టర్ పదవి ఇస్తే 2027 వన్డే వరల్డ్ కప్ సులభంగా టీమిండియా సాధిస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ప్రగ్యాన్ ఓజా చీఫ్ సెలక్టర్ గా సరిపోతాడని తాను అనుకోవడం లేదన్నారు.