E-Paper
Advertisement

రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!

రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!
Advertisement

Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ భేటీలో స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలతో క్షేత్రస్థాయి సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

‘చెప్పాం… చేస్తున్నాం’ నినాదంతో ముందుకు

Advertisement

గత సార్వత్రిక ఎన్నికల్లో పొందిన చారిత్రాత్మక విజయాన్ని పునరావృతం చేస్తూ, ఈ స్థానిక ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం పొందడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం వేగంగా నెరవేరుస్తోందని, ఈ క్రమంలోనే ‘చెప్పాం… చేస్తున్నాం’ అనే స్పష్టమైన నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతీ ఇంటికీ వివరించాలని సూచించారు.

మిత్రధర్మం.. అభ్యర్థుల ఎంపిక

Advertisement

పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేసే మంచి ఇమేజ్ ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని నేతలను ఆదేశించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా సాగాలని, క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరూ ‘మిత్రధర్మాన్ని’ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. స్థానిక నాయకత్వాలు సమన్వయంతో ముందడుగు వేయాలన్నారు.

రెబల్స్‌పై కఠిన హెచ్చరికలు

టిక్కెట్లు రాని ఆశావహులకు మున్ముందు నామినేటెడ్ పదవుల్లో తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి నామినేషన్లు వేసిన రెబల్స్ అందరూ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. కూటమి భాగస్వామ్యులైన జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కూడా తెదేపా రెబల్స్ ఎవరూ బరిలో ఉండకూడదని తెలిపారు. ఒకవేళ మాట వినకుండా నామినేషన్లు విత్ డ్రా చేసుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

Tags

Related News

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు: భూమన్ కరుణాకర్ రెడ్డి

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై మాత్రమే

విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక

Big Stories

Advertisement
×