E-Paper
Advertisement

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు
Advertisement

Vivekananda murder case: తప్పు చేస్తే ఎప్పటికైనా దొరికేస్తాం.. ఎవరూ చూడకపోయినా, పైన దేవుడు ఉంటాడని చాలామంది సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. కరెక్టుగా వివేకానందరెడ్డి హత్యలో అదే జరిగింది.. జరుగుతోంది. ఈ కేసు వ్యవహారం చివరి అంకానికి చేరింది. దర్యాప్తులో భాగంగా రెండో రోజు అవినాష్ రెడ్డి గురువారం ఈడీ ముందు హాజరయ్యారు. సాయంత్రం లోపు కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. అవినాష్‌ని అరెస్టు చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్లయిమాక్స్‌కి చేరింది. ఈ కేసులో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అందర్నీ రెండేసి రోజులు పైగానే విచారించింది ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. హత్యకు రూ.40 కోట్ల డీల్‌ జరిగిందన్న వ్యవహారం చుట్టూ సమాచారాన్ని సేకరించిన ఈడీ, అవినాష్‌రెడ్డిపై తొలిరోజు ప్రశ్నలు లేవనెత్తింది. దాదాపు ఏడుగంటలపాటు సాగిన విచారణలో నాకు తెలీదు.. మరిచిపోయాను.. గుర్తు లేదని.. మూడు ముక్కలు చెప్పారట.

గురువారం విచారణకు అవినాష్‌రెడ్డి, సాయంత్రానికి ఏమైనా జరగొచ్చు!

Advertisement

ఆధారాలు దగ్గర పెట్టి అడిగే సరికి నీళ్లు నమిలాడట అవినాష్‌రెడ్డి. మిగతా నిందితుల నుంచి సేకరించిన ఆధారాలు వీడియో రికార్డులు దగ్గర పెట్టి పదే పదే ప్రశ్నలు లేవనెత్తారట ఈడీ అధికారులు. హత్యకు ఉపయోగించిన డీల్ అంటే రూ. 40 కోట్లలో నీ వాటా ఎంత? దీనికి నిధులు ఎవరు సమకూర్చారు? నిధులు ఎలా వచ్చాయి? రూ.5 కోట్లు అంటూ ఎర్రగంగిరెడ్డి, దస్తగిరికి ఇచ్చిన హామీ ఏంటి? దస్తగిరికి ఇచ్చిన కోటి అడ్వాన్స్‌ వివరాలు దగ్గర పెట్టీ గుచ్చి గుచ్చి అడిగినట్టు తెలుస్తోంది. అసలు వివేకాను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దగ్గరి అనుచరుడు శివశంకర్‌రెడ్డి తెలీదంటే ఎలా?

2019 మార్చి 15కు జరిగిన పలు బ్యాంకు లావాదేవీల లావాదేవీల డేటాను దగ్గర పెట్టి ఆరా తీశారు అధికారులు. డబ్బుల వ్యవహారాలను మా ఆడిటర్‌ చూసుకుంటారని తప్పించుకునే ప్రయత్నం చేశారట. హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు, అవినాశ్‌రెడ్డి ఫోన్‌ సంబాషణలు, చెల్లించిన సొమ్ము గురించి ఆధారాలతో ప్రశ్నించినట్టు సమాచారం. బుధవారం విచారణలో అవినాష్‌రెడ్డి సరిగా సహకరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం విచారణకు రావాలని అధికారులు చెప్పారు.

Advertisement

ALSO READ: ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

సాయంత్రం లోపు హత్యకు ఉపయోగించిన రూ. 40 కోట్ల వ్యవహారం విషయాలు చెబితే ఓకే. లేకుంటే ఆయన్ని అరెస్టు చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసులోని ఇప్పటివరకు ఆరుగురు నిందితులను విచారించారు ఈడీ. అవినాష్ ఏడో వ్యక్తి. దీనికితోడు ఆగస్టులో జరిపిన సోదాల్లో పట్టబడిన రూ. 24 లక్షల వ్యవహారం గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

Big Stories

Advertisement
×