E-Paper
Advertisement

‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం

‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం
Advertisement

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల విపక్ష వైసీపీ హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వైకాపా నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫేక్ ప్రచారం, సొంత మీడియా ద్వారా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టుల్లో ఏకంగా 59 పిటిషన్లు వేశారని, అలాగే గతంలో డీఎస్సీపై 300 పైగా పిటిషన్లు వేసి నిరుద్యోగుల గొంతుకోశారని దుయ్యబట్టారు.

పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, కడప, తంబళ్లపల్లె, తిరుపతి వంటి వివిధ ప్రాంతాల్లో వైకాపా అరాచక శక్తులు తీవ్ర దౌర్జన్యాలకు పాల్పడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు హింసను ప్రేరేపిస్తోందన్నారు. పంజాబ్ రాష్ట్రం నుండి కిరాయి ముఠాలను తీసుకువచ్చి రాష్ట్రంలో భయబ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. కనిగిరిలో నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలు లాక్కున్నారని, తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి చేశారని గుర్తుచేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు బురఖా వేసుకుని మరీ నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి పత్రాలు లాక్కొని రావడం వైకాపా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

Advertisement

ఓ ఎంపీ వాహనంతో ఎన్డీఏ కార్యకర్తలను తొక్కించారని, ఆ కారులో మద్యం బాటిళ్లు, మారణాయుధాలు కూడా లభ్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తమ ప్రభుత్వం పూర్తిగా పని చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఈసీ ఆదేశాలను అనుసరిస్తామని కూటమి పార్టీల తరఫున ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేశామన్నారు. హింస సృష్టిస్తూ, తామే పిటిషన్లు వేయడం విడ్డూరంగా ఉందని, తప్పుడు లిటిగేషన్లతో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి క్రిమినల్ లిటిమెంట్లుగా మారారని విమర్శించారు. వైకాపా అరాచకాలను ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందన్నారు.

ప్రభుత్వం పనితీరు ఆధారంగానే ప్రజలు ఎప్పుడూ సరైన తీర్పు ఇస్తారని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రౌడీయిజం, నేరాలకు పాల్పడే వారిని ఎవరూ హర్షించరని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో రిస్క్ తీసుకొని నక్సలిజం, ఫ్యాక్షనిజం, కమ్యూనలిజంను సమూలంగా అణచివేశానని గుర్తుచేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో నెలల తరబడి ఉండే కర్ఫ్యూలను తొలగించి, నగరాన్ని ప్రశాంతంగా మార్చామని తెలిపారు.

Advertisement

2019-2024 మధ్య కాలంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని జగన్ పాలనను ఉద్దేశిస్తూ చంద్రబాబు అన్నారు. నేడు ఇటుక ఇటుక పేర్చుకుంటూ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తూ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ గత చర్యల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనస్తత్వంతో పోలిస్తే జగన్ మనస్తత్వం పూర్తిగా భిన్నమైందన్నారు. ఆయన ఆలోచనా విధానం రాష్ట్రానికే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.

Also Read: ‘కరువుపై బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం’.. కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్!

మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైకాపా నాయకులు అన్ని విధాలా కుట్రలు పన్నారని సీఎం మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధులు రాకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే స్థానిక ఎన్నికలపై అడ్డుపుల్లలు వేస్తున్నారన్నారు. బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం తాము సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయం సాధించామని, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడా బీసీలకు సముచిత స్థానం కల్పించి సీట్లు కేటాయించామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: ఇండియాలోనే డిజైన్, ఇండియాలోనే తయారీ.. 2028 నాటికి రాబోతున్న మన సొంత ఫోన్లు!

Tags

Related News

మైనింగ్‌లో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్ డెడ్.. హోంమంత్రి కీలక ఆదేశాలు!

ఏపీకి ‘అర్ణబ్’ తుఫాను ముప్పు.. రేపటికి తీవ్ర వాయుగుండం.. డేంజర్ జోన్‌లో ఆ జిల్లాలు!

అసెంబ్లీ సైకిల్‌ది.. మున్సిపాలిటీ ఫ్యాన్‌దేనా? ఇచ్ఛాపురంలో పీఠం ఎవరిది?

స్థానిక సమరంలో హింసకు తావులేదు: ఏపీ డీజీపీ కీలక హెచ్చరిక

నామినేషన్ల గడువు 48 గంటలు పెంచాల్సిందే! ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

మాజీ మంత్రిని తోసేసిన ఎస్‌ఐ.. చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత

విధ్వంసాలు వాళ్లు చేసి.. నిందలు మాపై నెడతారా? వైసీపీపై బొండా ఉమా ఆగ్రహం!

Big Stories

Advertisement
×