E-Paper
Advertisement

ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?

ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?
Advertisement

Chandrababu AmitShah: రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదనీ, జాతీయ, రాష్ట్ర స్థాయి భవిష్యత్ పరిణామాలకు ఇది రోడ్‌మ్యాప్ అని పొలిటికల్ ఎక్స్‌పర్స్ట్ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లులపై సమాలోచనలు జరిపారనే టాక్ వినిపిస్తోంది. ఈ బిల్లులను ఏ సమయంలో సభ ముందుకు తీసుకురావాలి? వాటికి అవసరమైన సంఖ్యాబలం, వ్యూహాలపైనే.. లోతుగా చర్చించారని సమాచారం. ఇదే సమయంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై వస్తున్న ఆరోపణలు, దేశంలో మారుతున్న తాజా రాజకీయ సమీకరణాలపై.. ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

రాజకీయ వ్యూహాలపై చర్చ..

జాతీయ అంశాలతో పాటు ఏపీకి సంబంధించిన కీలక స్థానిక అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలు, రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా.. ఏపీలో పెండింగ్‌లో ఉన్న, వేగంగా సాగుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సీఎం చంద్రబాబు హోంమంత్రికి వివరించారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఉన్న ఏపీ మంత్రివర్గ విస్తరణ అంశంపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రధానంగా.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల రూపకల్పన నుంచి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు, కేబినెట్ విస్తరణ వరకు ఎన్నో కీలక అంశాలు.. ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ.. ఏపీతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అతి త్వరలో..

Advertisement

చంద్రబాబు-అమిత్ షా భేటీ తర్వాత.. ఢిల్లీ నుంచి అమరావతి వరకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు పార్లమెంట్‌లో కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం సిద్ధమవుతుండగా, మరోవైపు ఏపీలోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. అతి త్వరలో జాతీయ రాజకీయాల్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి? రాష్ట్రంలో రాబోయే మార్పులు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Also read: ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

Tags

Related News

కడప ఎన్నికల ప్రచారంలో ఘోరం.. వైసీపీ మాజీ కార్పొరేటర్ పై కత్తితో దాడి!

చంద్రబాబు సంప్రదాయ రాజకీయాన్ని తిరగరాస్తున్న నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీలో మార్పులు!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

బుచ్చంపేటలో ఎంపీటీసీ ఏకగ్రీవంపై రచ్చ.. జక్కంపూడి రాజా ఎంట్రీతో మారిన సీన్!

సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

కృష్ణానదిలో ఘోర ప్రమాదం.. నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.. విజయవాడ కోర్టులో 102 పేజీల FIR!

Big Stories

Advertisement
×