E-Paper
Advertisement

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?
Advertisement

RP Patnaik:గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బయోపిక్ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.మాములుగా రియల్ లైఫ్ స్టోరీస్ ని సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చినప్పుడు కొంత డ్రామా జోడించడం కామన్. అయితే ఈ సినిమాపై ఆర్పీ పట్నాయక్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్పీ పట్నాయక్ గరివిడి లక్ష్మి దగ్గర ట్యూన్స్ కొట్టేసి ,డబ్బులు ఇవ్వకుండా,సినిమాలలో పాటలు పాడిస్తానని మోసం చేశాడన్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలా క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

అందుకే రియాక్ట్ అయ్యా 

ఈ వివాదంపై మాట్లాడటానికి అసలు నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదని,కానీ చాలా మంది తనపై ఒత్తిడి చేశారని,అసలు విషయం ఏంటో చెప్పాలని అనడంతోనే రియాక్ట్ అవుతున్నానని స్పష్టం చేశారు. అలాగే ఈ అంశంపై ఇదే తన చివరి ఇంటర్వ్యూ అని తేల్చిచెప్పడం విశేషం. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని, అందువల్లే ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నానని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి సినిమా సక్సెస్ కావాలని,అలాగే ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలని కోరుకున్నానని,కాని తనని ఇలా చూపిస్తారని అనుకోలేదని వాపోయారు.

Advertisement

తెలుసుకోకుండా సినిమా తీయడం సరికాదు 

సినిమాలలో ఫిక్షన్ స్టోరీస్ కి ఉన్న కంఫర్ట్ బయోపిక్ లకి ఉండదని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.ముఖ్యంగా సినిమాలో చూపించే కథలోని వ్యక్తులు ఇంకా బతికే ఉన్నప్పుడు మరింత బాధ్యత అవసరమని గుర్తుచేశారు. కేవలం ఒక్కరి వెర్షన్ మాత్రమే విని సినిమా తీయడం వల్ల అసలు నిజాలు పక్కకు పోయే ప్రమాదం ఉందని,నిజానిజాలు ఏంటో తెలుసుకుని ,వారిని కలిసి అసలు జరిగిన విషయాలు తెలుసుకోకుండా సినిమా తీయడం సరికాదని చెప్పుకొచ్చారు.

గరివిడి లక్ష్మి దగ్గరకు వెళ్లి పాటల ట్యూన్లు

ఇక గరివిడి లక్ష్మి పాటలతో తనకున్న అనుబంధాన్ని ఆర్పీ పట్నాయక్ గుర్తు చేసుకున్నారు. 1992–93 ప్రాంతంలోనే తాను కాలేజీ ఈవెంట్స్ లలో ఆ పాటలు పాడేవాడినని, ఉత్తరాంధ్ర జానపదం అనేది ఎవరి ఒక్కరి సొత్తూ కాదని స్పష్టం చేశారు. గరివిడి లక్ష్మి దగ్గరకు వెళ్లి పాటల ట్యూన్లు అడగాల్సిన అవసరం తనకు ఎప్పుడూ రాలేదని తేల్చి చెప్పారు.

గౌరీ నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడో !

ఒక జానపద కళాకారుడికి దక్కాల్సిన గుర్తింపు దక్కడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఆ కళను బేస్ చేసుకుని సినిమాలు తీసేటప్పుడు నిజాలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా చూపించడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశాడు ఆర్పీ పట్నాయక్ .చూడాలి మరి ఈ వివాదం పై గరివిడి లక్ష్మి కాని ఆ సినిమా దర్శకుడు గౌరీ నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడో !

ALSO READ :ఇదెక్కడి క్రేజ్ రా మామా.. గోరటి వెంకన్న పాటకు అప్పట్లో అంత డబ్బా?

Tags

Related News

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..

ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×