E-Paper
Advertisement

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?
Advertisement

Flying Fish: సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి. సాధారణంగా పక్షులు ఆకాశంలో ఎగరడం, చేపలు నీటిలో ఈదడం మనం చూస్తుంటాం. కానీ పక్షిలా రెక్కలు విప్పి, సముద్రపు అలల పైనుంచి గాల్లోకి ఎగిరే చేపలు కూడా ఉన్నాయి. వీటినే ఫ్లయింగ్ ఫిష్ అంటారు. సముద్రంలో ఉండే వింత జీవులలో ఇవి ఎంతో స్పెషల్. ఈ ఎగిరే చేపల వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.

ఫ్లయింగ్ ఫిష్..

ప్రపంచంలో ప్రతి ప్రాణి సృష్టి నీటినుంచే జరిగిందనేది ఒక సైంటిఫిక్ థియరీ. చేపల నుంచే అన్ని జీవులు పరిణామం చెందాయంటుంది ఈ థియరీ. ప్రతి జీవి ఆకారంలో ఉండే సారూప్యతలు దీనికి ఆధారం. మనిషికి ఉన్న చేతులు, పక్షులకు ఉండే రెక్కలు, చేపలకు ఉండే రెక్కలు పరిణామక్రమంలో అవసరాలకు అనుగుణంగా మారిపోయాయంటారు. ఈ థియరీని ఫ్లయింగ్ ఫిష్ బలపరుస్తుంది.

Advertisement

Also read: త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?

గాలిలో ప్రయాణం..

నిజానికి ఈ చేపలకు పక్షుల మాదిరి గాల్లో రెక్కలు ఆడించే శక్తి ఉండదు. కానీ వీటి శరీర నిర్మాణం ఎగరడానికి వీలుగా రూపాంతరం చెందింది. వీటికున్న విశాలమైన రెక్కలు పక్షి రెక్కలను పోలి ఉంటాయి. సముద్రంలో వేగంగా ఈదుకుంటూ వచ్చి, ఒక్కసారిగా నీటి ఉపరితలం పైకి దూకుతాయి. ఆ సమయంలో తమ రెక్కలను వెడల్పుగా చాచి, గాలి సాయంతో పారాగ్లైడింగ్ చేసినట్లుగా ముందుకు దూసుకుపోతాయి. దాదాపు 50 నుంచి 200 మీటర్ల దూరం వరకు ఈ చేపలు గాలిలో ప్రయాణించగలవు.

ప్రాణాలను అరచేతిలో..

Advertisement

ఈ చేపలు సరదా కోసం ఆకాశంలోకి ఎగరవు. సముద్రంలో తమను వేటాడే పెద్ద చేపలు దాడి చేసినప్పుడు, వాటి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఇలా చేస్తాయి. నీటిలో శత్రువులు వెంటాడగానే ఇవి గాల్లోకి ఎగిరి తప్పించుకుంటాయి. అయితే ఇక్కడే వీటికి మరో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇవి నీటిపైకి రాగానే ఆకాశంలో వేచి చూసే సముద్ర పక్షులు వీటిని వేటాడి తినేస్తుంటాయి. ఇలా అటు నీటిలో, ఇటు గాలిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇవి జీవిస్తుంటాయి.

Also read: ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

Tags

Related News

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

స్వేచ్ఛ చెప్పిందే నిజమైందా.. హెచ్‌సీఏ కుంభకోణంలో షాకింగ్ నిజాలు!

సంక్రాంతి తర్వాత గ్రామాల బాట.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్?

రాజకీయంగా చర్చకు వస్తున్న తెలుగు రాష్ట్రాలు! కరువు భయభ్రాంతులకు గురవుతున్న తెలంగాణ..! హింసాత్మక ఘటనలతో పరువు రచ్చకెక్కిన ఏపీ!

ఒక ఎమ్మెల్సీ సీటు గెలుపే లక్ష్యం.. నల్లగొండపై ఆశలు వదిలేసిన వైనం.. బన్సల్‌ రీ ఎంట్రీతో బీజేపీలో జోష్‌..!

టీడీపీని కలవరపెడుతోన్న ఆ సెంటిమెంట్.. విశాఖ మేయర్ మళ్లీ పీఠం కలేనా?

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

Big Stories

Advertisement
×