E-Paper
Advertisement

96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు

96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు
Advertisement

West Godavari:  శ్రీరాముడి కోసం శబరి, ఆంజనేయుడు ఎళ్లు తరబడి ఎదురుచూసిన ఉదంతాలు పురాణాల్లో వింటాము. సీఎం చంద్రబాబును చూడగానే 96 ఏళ్ల వయస్సులో వీరాభిమాని సత్యనారాయణ కళ్లలో మెరిసిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒక అభిమాని తన నాయకుడిని కలిసిన క్షణం కాదు, జీవితకాల అభిమానానికి దక్కిన గౌరవం. కాలం మారుతుంది.. తరాలు మారతాయి.. కానీ ఇలాంటివి చరిత్రలో నిలిచిపోతాయని చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.

96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు

Advertisement

ఎట్టకేలకు వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ వీరాభిమాని సత్యనారాయణ కోరిక తీరింది. జీవితంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో కలవలేనని భావించారు. ఆ పార్టీ నేతల పుణ్యమాని సోమవారం సాయంత్రం వెస్ట్‌గోదావరిలో ఆయనతో దాదాపు 10 నిమిషాల సేపు మాట్లాడారు సీఎం చంద్రబాబు.

సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు టూర్‌కు నాలుగు రోజుల ముందు కామధేనువు లంక గ్రామానికి చెందిన సత్యనారాయణ.. టీడీపీ, సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ని చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.

Advertisement

సీఎంతో దాదాపు 10 నిమిషాల సేపు మాటలు-ఆపై సమస్యలు

ఆ వీరాభిమాని దృష్టి సీఎం చంద్రబాబును ఆకట్టుకుంది. కార్యక్రమం తర్వాత తన బస్సులోకి వీరాభిమాని సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఆయనతో దాదాపు 10 నిమిషాల సేపు మాట్లాడారు ముఖ్యమంత్రి. వీరాభిమాని జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం అది.

కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తనకు-భార్యకు బీపీ, షుగర్ లేవని చెప్పుకొచ్చాడు. తొలుత తన గ్రామానికి ఉన్న సమస్యలు చెప్పాడు. ఆ తర్వాత తన కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వైద్య సహాయం అందించాలని సత్యనారాయణ కోరినప్పుడు భరోసా ఇచ్చారు సీఎం.

ALSO READ: స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు పవన్, లోకేష్ రాక 

గుడిసెలో ఉన్న సత్యనారాయణకు ఇల్లు కట్టించి ఇస్తామని అన్నారు. దానికి పెద్దాయన కళ్లలో ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన సమస్యలపై భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు.. సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అధికారంలో ఉన్నవారు చాలా మంది ఉంటారు, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకులు చాలా అరుదుగా ఉంటారు.

ఈ సన్నివేశంలో అదే కనిపించింది. దీన్ని కొందరు ఫోటోగా, మరికొందరు రాజకీయ కోణంలో చూస్తారు. మనుషుల మధ్య బంధానికి ప్రతీక, సీఎం చంద్రబాబును సత్యనారాయణ చూడడం, ఆ తర్వాత ఆయన్ని హత్తుకోవడం వంటి దృశ్యాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి.

 

 

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×