Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు కేసును విచారిస్తున్న వైజయంతికి దిమ్మతిరిగే నిజాలు తెలుస్తాయి. మనోహరి కోల్‌కతా వెళ్లాక ఏం చేసేదో తెలుసుకోవడానికొ ఒక టీంను కోల్‌కతా పంపిస్తే ఆ టీం మనోహరి గురించి అన్ని విషయలు తెలుసుకుని వస్తుంది. అందులో మనోహరి, రణవీర్‌ల పెళ్లి గురించి కూడా ఆ టీం సభ్యులు తెలుసుకుని వచ్చి వైజయంతికి చెప్తారు. దీంతో వైజయంతి షాక్ అవుతుంది. వాళ్లిద్దరికి ఒక పాప కూడా పుట్టిందని మనోహరి రణవీర్‌కు విడాకులు ఇచ్చి పాపను అనాథ ఆశ్రమంలో చేర్చింది ఆ పాపనే అమరేంద్రగారు అరుంధతి గారు దత్తత తీసుకున్నారు. ఆ విషయం మనోహరికి రణవీర్‌కు అసలు తెలియదు. కొన్నాళ్ల తర్వాత కొడైకెనాల్‌లో ఉంటున్న అమర్, అరుంధతిల దగ్గరకు మనోహరి వెళ్లింది. చాలా రోజుల తర్వాత వచ్చిన మనోహరిని చూసి అరుంధతి చాలా సంతోషపడింది. కానీ అమర్‌పై ఆశపడిన మనోహరి అరుందతి గారిని చంపేసింది మేడం.. ఆ విషయం తెలియని అమరేంద్ర పిల్లల కోసం తనను పెళ్లి చేసుకుంటాడని మనోహరి అనుకుంది.
అప్పుడే రేడియో జాకీగా పని చేస్తున్న అరుంధతి సొంత చెల్లెలు భాగీ ఎంట్రీ అయింది. అమరేంద్ర గారి ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయింది. అమర్ మీద ప్రేమ చావని మనోహరి కూడా హైదరాబాద్ వచ్చింది. అమర్ పిల్లలకు కేర్ టేకర్‌గా ఉన్న భాగీని అమరేంద్ర అనుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అలా మనోహరికి రెండోసారి కూడా నిరాశే ఎదురైంది. భాగీని అడ్డు తప్పించి అమర్‌ను సొంత చేసుకోవాలని ఎన్నో ప్లాన్లే వేసింది. కానీ భాగీ చాలా తెలివైనది మనోహరి అన్ని ప్లాన్లను తిప్పి కొట్టి అమరేంద్ర గారి భార్యగా ఆ ఇంట్లో నిలదొక్కుకుంది. అందుకు అమరేంద్ర గారి నమ్మిన బంటు విశ్వాసపాత్రులైన రాథోడ్ కూడా హెల్ప్ చేశాడు. అమరేంద్ర భాగీలకు ఒక పాప పుట్టింది. చనిపోయిన అరుంధతి గారే.. మళ్లీ పుట్టారని అందరూ సంతోషపడ్డారు. ఆ పాపకు ఏవో శక్తులు ఉన్నాయని మనోహరి తన మాజీ భర్తతో కలిసి మాంత్రికుడి సాయంతో కొన్ని దాడులు చేయించింది. కానీ భాగీ వల్ల ఆ ప్లాన్లు అన్ని ఫెయిల్ అయ్యాయి.. అరుంధతి కోరికి వల్ల మనోహరికి పెళ్లి చేయాలని అమరేంద్ర గారు అనుకున్నారు..
అప్పుడే పార్థు సార్ హైదారాబాద్ వచ్చాడు. మనోహరిని తొలి చూపులోనే ఇష్టపడ్డాడు.. పార్థు గారి ఇష్టాన్ని తెలుసుకున్న అమరేంద్ర గారు భాగీ పార్థు గారికి మనోహరికి పెళ్లి చేయాలనుకున్నారు. మనోహరికి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. కానీ ఆ విషయం తెలియని అమరేంద్ర గారు వాళ్లిద్దరికి పెళ్లి జరిపించేశారు. పెళ్లైన తర్వాత పార్థు, మనోహరి కలిసి ఢిల్లీ బయలుదేరారు. ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్‌లో మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే మేడం.. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే.. అని పోలీస్ టీం మెంబర్ చెప్పగానే.. వైజయంతి షాకింగ్‌గా అయితే అరుంధతిని చంపింది మనోహరి అన్నమాట. ఆ కేసు గురించే పార్థు ఇక్కడికి వచ్చాడు. మనోహరియే కిల్లర్ అని ఎందుకు తెలుసుకోలేకపోయాడు అని వైజయంతి అడిగితే..
అందుకు ఎవిడెన్స్ ఏమీ లేవు మేడం. ఆ కేసులో సాక్ష్యులు అందరినీ మనోహరి చంపేసింది. ఇంకోక షాకింగ్ విషయం ఏంటి అంటే అమరేంద్ర గారు కూడా అరుంధతి మర్డర్ కేసును ఎంక్వైరీ చేసి మనోహరియే హంతకురాలు అని కనిపెట్టారు అని ఆ వ్యక్తి చెప్పగానే.. వైజయంతి షాకింగ్‌గా వాట్ మరి నిజం తెలిస్తే మనోహరిని అమర్ ఎందుకు పట్టుకోలేదు అంటే అమర్‌కు నిజం తెలిసిన మరుక్షణమే ఆయనను చంపాలనుకుంది. లక్కీగా అమరేంద్ర గారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. బ్యాడ్ లక్ ఏంటంటే మెల్లగా కొంత కాలానికి గుర్తుకు వచ్చినా మనోహరి గురించి ఆయనకు గుర్తుకు రాలేదు మేడం అని చెప్పగానే.. చాలా విచిత్రంగా ఉందే.. అయినా మనోహరి గురించి భాగీకి తెలుసా..? అని వైజయంతి అడిగితే ఆ విషయం తెలియదు మేడం అంటాడు. అయితే నేను కనిపెడతాను మనోహరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాను అంటుంది వైజయంతి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.