E-Paper
Advertisement

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్, విజయ్-సానా-రామకృష్ణలకు ఛాన్స్

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్, విజయ్-సానా-రామకృష్ణలకు ఛాన్స్
Advertisement

CM Chandrababu: ఎట్టకేలకు పార్టీ తరపున మూడు రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసింది టీడీపీ హైకమాండ్. ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. వారిలో భాష్యం రామకృష్ణ, సానా సతీష్(రెండోసారి), చింతకాయల విజయ్‌ల పేర్లను ఖరారు చేసింది. పార్టీ తరపున వారికి పత్రాలను అందజేశారు ముఖ్యమంత్రి.

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే.. విధేయతకు పట్టం కట్టిన హైకమాండ్

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించింది టీడీపీ హైకమాండ్. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తర్వాత ముగ్గురు అభ్యర్థుల పేర్లను శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. వారిలో సానా సతీష్ రెండోసారి పెద్దల సభకు పంపిస్తున్నారు.

విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లను ఖరారు చేశారు. రాత్రి ముగ్గురు అభ్యర్థులతో సీఎం చంద్రబాబు దాదాపు అరగంటపాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత వారికి పార్టీ తరపున పత్రాలను అందజేశారు. ముగ్గురు అభ్యర్థులు సోమవారం తమ తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

Advertisement

 విజయ్-సానా సతీష్-రామకృష్ణలకు అవకాశం

మూడు రాజ్యసభ సీట్లకు పెద్ద కసరత్తు జరిగింది. సీనియర్లు, మహిళలకు ఛాన్స్ ఇస్తారని చాలామంది భావించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచివారికి పట్టం కట్టారు అధినేత. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేశారు.

అంతేకాదు పార్టీకి నమ్మకం, కేడర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వాటి ఆధారంగా ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు అభ్యర్థులు మూడు సామాజిక వర్గాలకు చెందినవారు. రామకృష్ణ కమ్మ కమ్యూనిటీకి చెందినవారు, సానా సతీష్ కావు వర్గం నేతగా ఉన్నారు. చింతకాయల విజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.

ALSO READ: భద్రాచలం ఆలయ భూముల కబ్జా.. ఏపీ మంత్రికి తెలంగాణ మంత్రి లేఖ.. ఏం రాశారంటే?

నిజానికి రామకృష్ణ, సతీష్‌ల అభ్యర్థిత్వాన్ని శుక్రవారం ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. మూడో సీటుకు ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తర్జనభర్జన పడ్డారు. చింతకాయల విజయ్‌తో పాటు సీనియర్‌ నేత వర్ల రామయ్య పేర్లు పరిశీలనకు వచ్చాయి. బీసీ వర్గానికి అవకాశం కల్పించడంతోపాటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆలోచనతో విజయ్‌ వైపు మొగ్గుచూపారట అధినేత.

ఇక విజయ్‌ తండ్రి అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు.  సానా సతీష్ కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. తెర వెనుక పార్టీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టిక్కెట్, అసెంబ్లీ టికెట్ ఆయన ఆశించారు.

కూటమి నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. చివరకు రాజ్యసభకు పంపిస్తున్నారు పార్టీ అధినేత. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ ఐటీడీపీ వింగ్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయనకు సీటు కేటాయంచడం ద్వారా యువతకు, నమ్మకస్థులకు సరైన గుర్తింపు ఇచ్చారనే ప్రచారం అప్పడు టీడీపీలో మొదలైంది.

 

 

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×