Cyclone Arnab: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త సోమవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తుపానుగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుపానుగా విజృభించనుంది. బుధవారం మధ్యాహ్నం ఏపీలోని బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. అర్నబ్ తుఫాన్ వాయు వేగంతో ఏపీ తీరం వైపు కదులుతోంది. తూర్పు ఆగ్నేయం విశాఖకు 870 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,010 కిలోమీటర్లు, బాపట్లకు 1080 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం మధ్యాహ్నం అర్నబ్ తుఫాన్ కాస్త బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను తీరం దాటే సమయంలో గంటలకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.
వాతావరణ శాఖ పరిస్థితి ముందుగా అంచనా వేసిన కూటమి ప్రభుత్వం.. సిబ్బందిని అలర్ట్ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అలర్ట్ చేసింది. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్-7, ఎస్డీఆర్ఎఫ్-8 బృందాలను మోహరించింది. తుఫాను కారణంగా తెలుగు రాష్రాల్లో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. అప్పుడు చల్లటి గాలులు వీస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సంచాలకులు మూర్తి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు దాదాపు 20 సెం.మీ.లోపు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ALSO READ: కడప ఎన్నికల ప్రచారంలో ఘోరం.. వైసీపీ మాజీ కార్పొరేటర్ పై కత్తితో దాడి!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావం నాలుగు జిల్లాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో రెడ్ హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి గాలులు వీస్తున్నాయి. మంగళవారం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు మొదలై 29 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.