Intinti Ramayanam Today Episode October 26th: శ్రీకర్ ఆ కమల్ కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కనిపించిన వాళ్లందరినీ అడుగుతూ ఉంటాడు అయితే ఆమె ఇక్కడే ఉండేదని అనే వాళ్ళు కానీ ఆమె ఇప్పుడు వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. దానితో శ్రీకర్ ఎలాగైనా సరే ఆమెను పట్టుకోవాలని తిరుగుతూ ఉంటారు. ఊర్లో ఉన్న కనిపించిన వాళ్లందరినీ అడిగి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఆమె కనిపించకపోవడంతో నిరాశ పడతాడు. శ్రేయ ఫోన్ చేయగానే శ్రీకర్ తో నేను మాట్లాడతాను అని అవని మాట్లాడుతుంది. అయితే ఆవిడ దొరకలేదని తెలుసుకున్న అవన్నీ ఇన్సూరెన్స్ నుంచి వచ్చాము అని చెప్తే ఎవరైనా కచ్చితంగా వస్తారు. అప్పుడు ఆమెను పట్టుకోవచ్చు అని అవని చెప్పగానే.. శ్రీకరను గ్రేట్ వదినా అని అంటాడు మరి కమలా దొరుకుతుందా లేదా అన్నది ముందు ఎపిసోడ్ లలో చూడాలి.
కమల్ ఇంటికి రాదని బయట ఉన్న బకెట్లో నీళ్లు తెచ్చుకుని అందరినీ అరుస్తూ ఉంటాడు. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా భానుమతి వెళ్లిపోయిందని బాధ పడిపోతూ ఉంటారు. కానీ కమల్ మాత్రం బయట నుంచి కేకలు వేసి లుంగీ డబల్ తీసుకు రమ్మని అరవగానే లుంగీ టవర్ ఎందుకు అడుగుతున్నారు ఈ టైంలోని అందరూ బయటకు వెళ్తారు కానీ అప్పటికే కమల్ తల మీద నీళ్లు పోసుకుంటూ కనిపిస్తాడు అది చూసినా ఇంట్లోని వాళ్ళందరూ కూడా.. టెన్షన్ పడుతూ ఏం అయింది? ఏం చేస్తున్నావ్ అని అందరూ అడుగుతారు అయితే కమల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
పల్లవి మీ ఇంటికి పట్టిన శని దాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి తరిమేయ్యాలి అని అందరూ అనుకుంటారు. కమల్ జీవితం ఏమైపోతుందో అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కమల్ చేసిన పని మాత్రం అందరికీ షాక్ అని ఇస్తుంది. తండ్రికి విడాకులు పంపామని నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కమల్ పై అరుస్తారు. అయితే కమల్ మాత్రం ఈ ఇంటికి పట్టిన శనిని నేను వదిలించుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి మీరు నాకు అడ్డుపడకండీ అని అంటాడు. నా జీవితం ఎన్ని రోజులు నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పటినుంచి నేను నా జీవితాన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అని కమల్ అంటాడు. అయితే కమ్మలు విడాకులు నోటీస్ పంపడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
కమల్ విడాకులు నోటీసు పంపాడు అని తెలియదని పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా కమల్ పని కాదు కమల్ చేత ఆ అవనినే విడాకుల నోటీసు పంపించింది అని పల్లవి అవినీతి సీరియస్ అవుతుంది. నువ్వు ఇప్పటికైనా మారి నీ భర్తకు దగ్గర వాళ్ళని చూడాలి అని మీనాక్షి ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం నాకు మీరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది అటు భానుమతిని జీవితాన్ని నీ చేతిలో రా నువ్వే నాశనం చేసుకున్నావు అంటూ చాలా బాధపడుతుంది. నువ్వు ఎంత చేసిన కూడా ఇలానే మారకుండా ఉంటే ఒంటరిగా మిగిలిపోతావు అని భానుమతి ఏడుస్తుంది కానీ పల్లవి మాత్రం నాకోసం మీరు ఎవరు ఏడవాల్సిన అవసరం లేదు నా గురించి నీకు చేసుకుంటానని అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది.
పల్లవి ఏమన్నా కూడా ఇక అవని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు పల్లవి వల్ల కామన్ జీవితం ఎలా మారుతుంది అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి ఇంట్లోకి నానా రచ్చ చేస్తుంది. కమల్ విడాకులు నోటీసులు పంపించడానికి కారణం నువ్వే అంటూ అవనిపై చెయ్యెత్తి కొట్టాలని అనుకుంటుంది కానీ అప్పుడు అక్కడికి వచ్చిన కమల్ చెయ్యి దించు.. మా వదిన మీద చెయ్యి ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం అంటూ పల్లవి పై సీరియస్ అవుతాడు కమల్. పల్లవి మీ అంతు చూస్తాను ఎవరిని అసలు వదిలిపెట్టను అని వెళ్ళిపోతుంది కమల్ జీవితం ఎలా మారిపోతుంది అని భయంగా ఉంది అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..