BigTV English

Big Shock to Mudragada from Family: ఫ్యామిలీలో రాజకీయ చిచ్చు.. ముద్రగడకు కూతురు ఝలక్..!

Big Shock to Mudragada from Family: ఫ్యామిలీలో రాజకీయ చిచ్చు.. ముద్రగడకు కూతురు ఝలక్..!

Big Shock to Mudragada from His Daughter: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీలో చిచ్చురేపింది. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకించారు కూతురు క్రాంతి. కేవలం పవన్ కల్యాణ్‌ను తిట్టడానికి మా నాన్నను జగన్ పార్టీ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ గెలుపుకు తనవంతు కృషి చేస్తారని చెప్పుకొచ్చారు క్రాంతి. అసలేం జరిగిందంటే..


పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి శాయిశక్తులా కృషి చేస్తున్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. అంతేకాదు పిఠాపురం వైసీపీ నియోజకవర్గం బాధ్యతలను సీఎం జగన్.. ఆయనకు అప్పగించారు. పేరుకే అభ్యర్థిగా వంగా గీత.. కానీ వ్యవహారాలను చక్కబెట్టేది ఆయనే! పగలు, రాత్రి అనే తేడా లేకుండా నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నారు ముద్రగడ. అంతేకాదు వేర్వేరు కుల సంఘాలతో భేటీ అయ్యి జగన్ సర్కార్ గురించి వివరించడం మొదలుపెట్టారు. దీంతో పిఠాపురంలో ముద్రగడ వర్సెస్ పవన్ కల్యాణ్ తరహాగా ఫైట్ మారింది. ఈ క్రమంలో పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.

Also Read: Ap Politics: ఏపీలో విచిత్ర పోరు..బరిలో మాజీ సీఎంల వారసులు


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను తిట్టడానికి ముద్రగడను వైసీపీ ఉపయోగించుకుంటోందని ఆవేదన వ్యక్తంచేశారు ఆయన కూతురు క్రాంతి. పవన్‌కు మా నాన్న చేసిన ఛాలెంజ్ చాలా బాధాకరమైనదన్నారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కాలేదన్న ఆమె, ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదన్నారు. పోటీ ఎప్పుడు హుందాగా ఉండాలని, కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

ఎన్నికల తర్వాత మానాన్నను వైసీపీ వదిలివేయడం ఖాయమన్నారు క్రాంతి. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ గెలుపుకు తన వంతు కృషి చేస్తారన్నారు ముద్రగడ కూతురు క్రాంతి. మరోవైపు కూతురు క్రాంతి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు ముద్రగడ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే అన్నారాయన. తన కూతురుకి మ్యారేజ్ అయిపోయిందని, ఇప్పుడు ఆమెకు మెట్టినిల్లే ముఖ్యమన్నారు. తన కూతురుతో కొందరు తిట్టించడం బాధాకరమన్నారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, కేవలం పార్టీలో సేవకుడిని మాత్రమేనని చెప్పాశారు ముద్రగడ.

Also Read: ముహూర్తం ఓకే, కడపకు రాహుల్, సీఎం రేవంత్

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×