Rahul Gandhi and CM Revanth Reddy attending Public Meeting in Kadapa on May 7th: కడప పార్లమెంట్ సీటు గెలుచుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా తొలి విడత కడప పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలను బస్సుయాత్ర ద్వారా చుట్టేశారు. ఇప్పుడు రెండు విడత ప్రచారం మొదలు పెట్టేశారు.
షర్మిల ప్రచారానికి మరింత జోష్ వచ్చేలా ఏఐసీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారానికి కడపకు రానున్నారు. ఈనెల ఏడున కడపకు యువనేత వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా నిర్వహించే ప్రచార సభకు ఆయన హాజరుకానున్నారు.
ఈ మేరకు ఏఐసీసీ నుంచి ఏపీ కాంగ్రెస్ యూనిట్‌కు సమాచారం వచ్చింది. రాహుల్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెరుగ్గానే ఉందని భావించిన ఏఐసీసీ పెద్దలు, రాబోయే రోజుల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు.
Also Read: అన్న, చెల్లెలి మధ్య పోటీ.. రంగంలోకి ఫ్యామిలీ
మరోవైపు వైఎస్ షర్మిల మాత్రం వైసీపీ సర్కార్‌తోపాటు ఆ పార్టీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. న్యాయం ఒకవైపు.. నేరం మరోవైపు అంటూనే ప్రచారంలోకి దూసుకు పోతున్నారు. ప్రజాకోర్టులోనే వివేకానంద హత్య నిందితులకు సరైన శిక్ష పడుతుందన్నారు. జమ్మల మడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో ఆర్టీపీపీ కార్మికులతో సమావేశమైన ఆమె, పరిశ్రమలను అదానీకి, అంబానీలకు అప్పగించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. పోలింగ్ అయ్యేవరకు కడప డీసీసీ కార్యాలయంలోనే వైఎస్ షర్మిల బస చేయనున్నారు. మొత్తానికి రాయలసీమపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.