E-Paper
Advertisement

చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!

చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!
Advertisement

Narayana Swamy: చిత్తూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి లక్ష్యంగా జరిగిన దాడి స్థానికంగా పెద్ద కలకలమే రేపింది.

నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా..

Advertisement

పెనుమూరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడమే లక్ష్యంగా నారాయణస్వామి తన అనుచరులతో కలిసి జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలోనే అక్కడే కాపుకాసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన వాహనాన్ని, అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మాటమాట పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి చేతులు దాటిపోయింది. టీడీపీ కార్యకర్తలు గుంపులుగా చేరి నారాయణస్వామిపై దాడికి దిగారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పరిస్థితి విషమించకుండా పోలీస్ బందోబస్తు

Advertisement

కార్యాలయం ప్రాంగణమంతా నినాదాలు, నెట్టివేతలతో రణరంగాన్ని తలపించింది. కార్యాలయం బయట భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గుమిగూడటంతో అరాచక వాతావరణం నెలకొంది. ఈ అకస్మాత్తు పరిణామంతో మాజీ డిప్యూటీ సీఎం భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఈ హఠాత్ పరిణామంతో చిత్తూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నామినేషన్ ప్రక్రియ సమయంలో జరిగిన ఈ దాడి ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

Also Read: పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

Tags

Related News

మీది ఆరాటం.. మాది పోరాటం.. ఎన్నికల తీరుపై వైకాపా నేతల ఆగ్రహం!

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు: భూమన్ కరుణాకర్ రెడ్డి

రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

Big Stories

Advertisement
×