TVS Ntorq 150 New Colours: TVS మోటార్ కంపెనీకి చెందిన స్పోర్టీ స్కూటర్ Ntorq 150 మరో కొత్త కలర్ లో కనిపించింది. అధికారికంగా ఈ రంగును ప్రకటించకముందే, కొత్త డార్క్ గ్రీన్ కలర్ స్కూటర్ షోరూమ్‌కు చేరింది. బ్లాక్, గ్రీన్ కలర్స్ కలయికతో ఉన్న ఈ కొత్త కలర్ స్కీమ్ స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తోంది. అయితే, ఈ కొత్త కలర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ధరలో మార్పు ఉంటుందా? అనేది కంపెనీ వెల్లడించాల్సి ఉంటుంది.
TVS Ntorq 150 ప్రస్తుతం పనితీరుకు ప్రాధాన్యతనిచ్చే స్పోర్టీ స్కూటర్‌గా అందుబాటులో ఉంది. తాజాగా కనిపించిన కొత్త మోడల్ లో బ్లాక్ కలర్ కు గ్రీన్ హైలైట్స్ ను యాడ్ చేశారు. ఈ కలర్ స్కీమ్ స్కూటర్ కు స్పెషల్ లుక్ ఇస్తోంది. కొత్త కలర్ కు సంబంధించిన అధికారిక పేరు ఇంకా వెల్లడించలేదు. అందుబాటులో ఉన్న ఫోటోలను బట్టి చూస్తే, ఈ కొత్త రంగు టాప్ TFT వేరియంట్ లో ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ విషయాన్ని TVS కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రంగులకు కొత్త ముదురు ఆకుపచ్చ రంగు కలిస్తే, TVS Ntorq 150 మొత్తం ఐదు రంగుల్లో లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ స్కూటర్ టోర్నాడో బ్లూ, స్టెల్త్ సిల్వర్, రేసింగ్ రెడ్, నైట్రో గ్రీన్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంది. నైట్రో గ్రీన్ రంగు TFT వేరియంట్‌కు ప్రత్యేకంగా లభిస్తోంది. కొత్త ముదురు ఆకుపచ్చ రంగును కూడా కంపెనీ టాప్ వేరియంట్‌కే పరిమితం చేస్తుందా? లేదా ఇతర వేరియంట్లలోనూ అందిస్తుందా? అనేది అధికారిక ప్రకటన తర్వాత స్పష్టమవుతుంది.
కొత్త రంగు మినహా స్కూటర్‌లో ఇతర మార్పులు ఉండకపోవచ్చని అంచనా. ప్రస్తుతం TVS Ntorq 150లో 149.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 13.2hp పవర్, 14.2Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ స్టాండర్డ్, TFT అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. రెండింటిలోనూ బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త కలర్ పరిచయం చేసినప్పటికీ, ఇంజిన్, ఇతర మెకానికల్ అంశాల్లో మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం TVS Ntorq 150 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.13 లక్షలు కాగా, TFT వేరియంట్ ధర రూ.1.22 లక్షలుగా ఉంది. కొత్త కలర్ అధికారికంగా అందుబాటులోకి వచ్చినప్పుడు ధరలో మార్పు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ స్కూటర్‌కు మార్కెట్లో ప్రధాన పోటీదారుల్లో ఏప్రిలియా SXR GT ఉంది. అయితే, కొత్త కలర్ లాంచ్ తేదీ, ధర, లభ్యతకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
Read Also: గూగుల్ మ్యాప్స్, క్విక్‌షిఫ్టర్.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ N250SS వచ్చేసింది!