Butchi Babu: ఆంధ్రప్రదేశ్లో విశాద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చిమహేశ్వరరావు కన్ను మూశారు. ఈయనను బుచ్చిబాబు అని కూడా పిలుస్తారు.
నేడు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. బుచ్చిబాబుది స్వగ్రామం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గోపవరం ప్రాతానికి చెందిన వ్యక్తి.. అయితే ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 1983, 1994 సంవత్సర కాలంలో అల్లవరం నియోజక వర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు.
దీంతో పాటుగా 1984లో అమలాపురం ఎంపీగా కూడా బుచ్చిబాబు గెలిచారు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్థుతం తెలుగు దేశం పార్టీలోని కార్యక్రమాలకు యాక్టీవ్ గా పనిచేశారు. అయితే అనారోగ్య సమస్యలు రావడంతో గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో చికిత్స పొందుతూ అస్వస్థతకు గురై నేడు తుది శ్వాసవిడిచారు. బుచ్చిబాబుకు భార్యతో పాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తెలిపారు.
Also read: తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?