Garividi Lakshmi:గరివిడి లక్ష్మి..ఈ సినిమా నిన్ననే థియేటర్ లోకి వచ్చి మంచి మౌత్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ సందర్భంగా దర్శకుడు గౌరీ నాయుడు మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు. తన కథను నమ్మి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తనతో కలిసి పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తాను పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.
గౌరీ నాయుడు మాట్లాడుతూ
సక్సెస్ మీట్లో గౌరీ నాయుడు మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత దూరం వస్తుందని తాను అస్సలు అనుకోలేదని చెప్పారు. సినిమా విడుదల కాకముందే తనకు సక్సెస్ చూపించారని, ఒక కొత్త దర్శకుడికి ఇలాంటి అవకాశం రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. తనకే కాదు, ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చిన్న సినిమాను కూడా ఆదరించి, దాని గురించి అందరికీ తెలిసేలా చేసిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
అయితే ఈ సినిమా అంత ఈజీగా సాగలేదనిముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ కథ కావడంతో మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని వాపోయాడు. ఈ కథను తీసుకుని కొన్ని నిర్మాణ సంస్థల దగ్గరకు వెళ్లానని ,కథ విన్నవాళ్లు బాగుందని చెప్పినా, లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఇప్పుడు చేయలేమని చెప్పేవారని బాధ పడ్డాడు. మరికొందరైతే కొంత డబ్బు పెట్టగలమని, మిగతా పెట్టుబడి కోసం మరో పార్ట్నర్ను తీసుకురావాలని అన్నారని ఎమోషనల్ అయ్యాడు.
ఆ సమయంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీని కలిసానని అక్కడ కూడా కథ చెప్పిన తర్వాత దాదాపు రెండు నెలల వరకు ఎలాంటి సమాధానం రాలేదని అన్నాడు. దీంతో ఇక ఈ కథతో సినిమా చేయడం కష్టమేనని, మరో కథ రాసుకుందామని అనుకున్న సమయంలో ఆయనకు సపోర్ట్ గా నిలిచిన లక్ష్మి మాత్రం ఈ కథపై నమ్మకం కోల్పోలేదని తెలిపాడు. చివరిసారిగా ప్రయత్నిద్దామని చెప్పి శ్రీకాకుళంలోని రాజులమ్మ తల్లి గుడికి తీసుకెళ్లారని చెప్పాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఫోన్
తనకు దేవుడిపై కూడా నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నానని, అయినప్పటికీ లక్ష్మి చెప్పడంతో గుడికి వెళ్లి ఇద్దరం కన్నీళ్లతో ప్రార్థించామని గుర్తుచేసుకున్నాడు. సినిమా ఎలాగైనా బయటకు రావాలని కోరుకున్నామని అక్కడి నుంచి బైక్పై తిరిగి వస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపాడు. సినిమా ఓకే అయిందని, అడ్వాన్స్ తీసుకోవడానికి రావాలని చెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలిపాడు. వెంటనే ఈ విషయాన్ని లక్ష్మి గారికి చెప్పానని, ఆ క్షణంలో ఇద్దరం చాలా ఎమోషనల్ అయ్యామని గుర్తుచేసుకున్నాడు.
ఈ సంఘటన జరిగి దాదాపు మూడేళ్లు అయిందని ఒకప్పుడు తన కథను పట్టించుకోని పరిస్థితి నుంచి ఇప్పుడు అదే కథకు మంచి గుర్తింపు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ తన కథను నమ్మి ముందుకు రావడం వల్లే ఈ సినిమా సాధ్యమైందని చెప్పారు. ముఖ్యంగా కృతి ప్రసాద్ ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కథపై నమ్మకంతో నిలబడ్డారని, ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యాడు.
దర్శకుడిగా తనకు దక్కిన గొప్ప విజయం
ఇక సినిమాలో మెయిన్ లీడ్ చేసిన ఆనంది గురించి మాట్లాడుతూ నటనకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తుంటే తన మనసు నిండిపోయిందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు సినిమా చూసి నిజంగా గరివిడి లక్ష్మినే చూసినట్టుందని అంటుండటం తనకు చాలా సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఒక పాత్రకు ఇంత మంచి పేరు రావడం, ప్రేక్షకులు ఆ పాత్రతో కనెక్ట్ అవ్వడం దర్శకుడిగా తనకు దక్కిన గొప్ప విజయమని తెలిపారు.మొత్తానికి, ‘గరివిడి లక్ష్మి’ సక్సెస్ మీట్లో గౌరీ నాయుడు చెప్పిన మాటలు అందరినీ కదిలించాయనడం లో సందేహం లేదు !
ALSO READ :సలార్లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?