E-Paper
Advertisement

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. తీసుకున్న కీలక నిర్ణయాలివే..
Advertisement

AP E-Cabinet Meeting: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత పేపర్ లెస్ కేబినెట్ భేటీ నిర్వహించారు. 2014-19 కాలంలో టీడీపీ హయాంలో ఈ-కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాతి ప్రభుత్వం పేపర్ తో కూడిన కేబినెట్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ-కేబినెట్ విధానాన్ని పునరుద్ధరించింది.

ఈ-కేబినెట్ భేటీలో అజెండా నుంచి నోట్స్ వరకూ.. సమాచారాన్నంతా ట్యాబ్ లోనే ఉంచారు. దానిలో ఉంచిన సమాచారం మేరకే ఒక్కో అంశంపై మంత్రివర్గం చర్చించింది.

Advertisement

Also Read: ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణస్వీకారం

ఏపీ ఈ-కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

Advertisement

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్లీ పాతవిధానంలోనే టెండర్లను పిలిచేందుకు ఆమోదించింది. అలాగే కొత్త మద్యంపాలసీ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేసింది.

రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించేందుకు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఓకే చెప్పింది. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×