BigTV English

Viral Video: చనిపోయిన భారీ తిమింగలంపై డ్యాన్స్ చేస్తూ వెకిలి చేష్టలు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: చనిపోయిన భారీ తిమింగలంపై డ్యాన్స్ చేస్తూ వెకిలి చేష్టలు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా మనుషుల కంటే జంతువులు, జలచరాలు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఈ వీడియోలు చూడడానికే ఇష్టపడుతుంటారు. జంతువులు చేసే పనులు, వేటాడటం, వాటి ఆహారాలు, వాటి జీవనశైలికి సంబంధించిన వీడియోలు ముఖ్యంగా ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అందులోను సముద్రంలోని జలచరాల వీడియోలు చూసేందుకు ఎక్కుంశ ఆసక్తి చూపిస్తుంటారు. సముద్రంలో పెద్ద పెద్ద చేమలు, తిమింగలాలు వంటివి జీవిస్తుంటాయి. అవి చిన్నచిన్న చేపలను తింటూ చనిపోయే వరకు నీటిలో నివసిస్తుంటాయి. అయితే తాజాగా సముద్రంలోని ఓ చనిపోయిన తిమింగలానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తిమింగళం అని కూడా చూడకుండా దానిపై నిలబడి నాట్యం చేశారు. వన్యప్రాణులు అంటే కనీసం గౌరవం కూడా లేకుండా సముద్రపు జీవరాశిపై ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రవర్తన మనుషులందరినీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి చేసింది. సముద్రంలోనే అతి పెద్ద జీవరాశి అయిన తిమింగళం మరణిస్తే దానిపై నాట్యం చేయడం ఏంటని అందరూ మండిపడుతున్నారు.

వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఓ మరణించిన తిమింగళంపై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో వ్యక్తులు కనీసం మానవత్వం అనేది లేకుండా ఇలా ప్రవర్తించడం సబబు కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాదు మరణించిన తిమింగళం కళేబరం నుంచి చెడు విషయవాయువులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలా దానిపై నాట్యం చేసి వ్యాధుల బారిన పడడం అవసరమా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దానిని సముద్రంలో నుంచి వెంటనే తొలగించాలని, లేకపోతే సముద్రం అంతా దాని కళేబరంలోని విషవాయులు వ్యాపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 

Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×