E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషుకు కంపెనీలో ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇందు

Brahmamudi Serial Today Episode October 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషుకు కంపెనీలో ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇందు
Advertisement

Brahmamudi serial today Episode:  అందరూ హాల్లో కూర్చుని ఆలోచిస్తుంటే.. శేషు వచ్చి ఏంటి అందరూ ఎవరో పోయినట్టు సైలెంట్‌గా కూర్చుంటారు అని అడిగితే.. ఈరోజు టెండర ఎవరికి వస్తుందో తెలిసే రోజు వీళ్లంతా ఐషుకు రావాలని కోరుకునే వర్గం వాళ్లంతా ఇందుకు రావాలని కోరుకునే వర్గం అని చెప్తాడు. లక్కీ మాత్రం దేవుడా ఈ టెండర్‌ ఐషుకే రావాలని మొక్కుతుంటాడు. అప్పుడే రాజు వస్తాడు. మీ ముఖాలు చూస్తుంటే టెండర్‌ మీకు రాలేదని అర్థం అవుతుంది అంటూ రేఖ చెప్పగానే.. ఇందు ఎవరూ టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు గుడ్‌ న్యూస్‌తోనే వచ్చాను. అంటూ స్వీ్ట్స్‌ పంచుతుంది. భ్రమరాంబ వెటకారంగా టెండర్‌ నీకే వచ్చిందా..? అని అడిగితే..

స్వీట్స్‌ తీసుకోండి చెప్తాను అంటూ ఐషు దగ్గరకు వెళ్లి స్వీట్‌ తీసుకో ఐషు అంటే ఎందుకు అని ఐశ్వర్య టెండర్‌ నీకే వచ్చింది అని చెప్తుంది ఇందు. ఆ మాట వినగానే.. లక్కీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఐషు అంటూ పైకి ఎత్తేస్తాడు. ఐషు మాత్రం మీ బాధను బయటకు కనిపించకుండా ఇలా స్వీట్స్‌ పంచుతూ కవర్‌ చేస్తున్నారా.. అంటుంది. కవర్‌ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను నా ఫ్యామిలీ అనుకున్నాను అందుకే స్వీట్స్‌ పంచుతాను అంటుంది. కానీ ఐషు కోపంగా ఇందును తిడుతుంది. అపర్ణ, రాజు తిడతారు. అయినా వినకుండా టెండర్‌ చేజిక్కించుకుంటే కంపెనీలో అన్ని పవర్స్‌ ఇస్తానన్నావు కదా ఇదిగో ఈ పేపర్స్‌ తీసుకొచ్చాను సంతకం చేయ్‌ అనగానే.. ఇందు పేపర్స్‌ మీద సంతకం చేసి ఇస్తుంది. అవి తీసుకుని వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత శృతి టెండర్‌లో ఐశ్వర్య కోటి రూపాయల తక్కువకు కోట్‌ చేశారు. అందుకు మీకు రావాల్సిన టెంబర్‌ వాళ్లకు వచ్చేలా చేసుకున్నారు అని చెప్పగానే.. ఇందు షాక్‌ అవుతుంది. ఆఫీసుకు ఏవరెవరో వచ్చి వెళ్తున్నారు.. మీరు పట్టించుకోకపోతే ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తుంది అని చెప్పగానే.. ఇదంతా నేను చూసుకుంటాను నువ్వు ఈ విషయం ఆఫీసులో ఎవ్వరికీ చెప్పకు అంటే సరే మేడం అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. ఇందు వెళ్లి ఐశ్వర్యను కోటి రూపాయల తక్కువ బడ్జెట్‌ ఎందుకు కోట్ చేశావని అడుగుతుంది. అందుకు ఐశ్వర్య తన బిజినెస్‌ సీక్రెట్‌ చెప్పనని అంటుంది ఐషు. రేఖ అడ్డు పడి నువ్వేంటి పెద్ద లీడర్‌లా ప్రశ్నిస్తున్నావు.. తన విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని అడుగుతుంది. దీంతో భ్రమరాంబ కూడా ఇన్ని రోజులు ఐషుతో ఆడుకున్నది చాలదా..? అంటుంది. ఐశ్వర్య కూడా కోపంగా ఇక నుంచి లక్కీ విషయంలో చిన్నచూపు చూసినా నేను ఊరుకునేది లేదు అంటూ చెప్పి వెళ్లిపోతుంది. అసలు ఐశ్వర్య ఏం చేస్తుందని ఇందు కంగారు పడుతుంది.

తర్వాత రేఖ, భ్రమరాంబ ఇద్దరూ కలిసి ఐశ్వర్య దగ్గరకు వెళ్తారు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఐషు. అన్ని సరిగ్గా ఉంటే స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు నిన్ను చైర్మన్‌ చేయాల్సింది అనగానే.. ఆ రాజు గాడు వచ్చి అంత చెడగొట్టాడు అంటుంది భ్రమరాంబ. అదంతా సరే కానీ ఈ టెండర్‌ను ఎలా పూర్తి  చేస్తావు.. అని అడిగితే.. ఇలాంటివి అన్ని ఎలా డీల్‌ చేయాలో మీకు తెలియదా ఆంటీ.. మీ నుంచే కదా నేను నేర్చుకున్నది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎంత డబ్బు తగ్గితే అంత క్వాలిటీ తగ్గుతుంది. ఈ ఒక్క టెండరే కాదు ఇక నుంచి స్వరాజ్‌ గ్రూప్‌ కంపెనీకు వెళ్లే ప్రతి టెండర్‌ నేనే చేజిక్కించుకుంటాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

Advertisement

ఇందు, రాజు ఆఫీసు వెళ్లడానికి బయటకు వచ్చి తమ తమ కారు అపర్ణ, సుభాష్‌ తీసుకెళ్లారని రేఖ కారు తీసుకెళ్తారు. రేఖ మేడంకు ఏం చెప్పమంటారు అని డ్రైవర్‌ అడిగితే మేము ఆఫీసుకు తీసుకెళ్లామని చెప్పు అంటాడు రాజు. వాళ్లు వెళ్లిపోయాక రేఖ, భూషణ్‌, భ్రమరాంబ, శేషు వస్తారు తమ కారెక్కడని డ్రైవర్‌ను అడిగితే రాజు సార్‌ తీసుకెల్లిపోయాడని చెప్తాడు. అందుకు రేఖ కోపంగా తిడుతూ ఐశ్వర్య కారులో వెళ్దామని బయలుదేరుతుంటే.. ఐశ్వర్య వచ్చి తన కారు క్లీన్‌ చేసినందుకు రేఖకు థాంక్స్‌ చెప్తుంది. కారేసుకుని ఆఫీసుకు వెళ్లిపోతూ.. ఆంటీ ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా మంచి బిజినెస్‌ ప్లాన్‌ ఏదైనా ఆలోచించండి ఐడియా బాగుంటే నేను డబ్బులు ఇస్తానంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఐశ్వర్య మాటలకు రేఖ షాకింగ్‌ తో ఆగిపోతుంది. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: అయ్యో.. రౌడీలతో రచ్చ.. ఆరాధ్య కిడ్నాప్.. పల్లవి ప్లాన్ ఇదా..

Wedensday TV Movies : బుధవారం టీవీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మల మధ్య గొడవ   

వంశీకి నిజంగానే బ్రెయిన్ లేదా.. రెచ్చగొట్టిన ముఖేష్!

కొత్త కారు కొన్న యాంకర్ శివజ్యోతి.. ధర ఎంతంటే?

నీతూ వర్సెస్ వర్షిణి.. అసలైన దమ్ము ఎవరికుంది?

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Big Stories

Advertisement
×