Intinti Ramayanam Today Episode October 21st: శ్రీయ అవనీ కోసం కాఫీ తీసుకొని వస్తుంది. అక్క లేచావా నువ్వు లేస్తావని ఇప్పటికి రెండుసార్లు కాఫీ తీసుకొని వచ్చాను కానీ నువ్వు లేవలేదు అందుకే మళ్ళీ చేసుకొని వచ్చాను అని చెప్పగానే నాకోసం నువ్వు ఎందుకు శ్రేయ కష్టపడి పోతున్నావు అని అవని అంటుంది. నాకోసం నువ్వు అన్ని చేస్తున్నావ్ కదా అక్క నీకోసం నేను ఈ మాత్రం కూడా చెయ్యకపోతే ఏం బాగోదు అని ఏ అంటుంది అటు ఆరాధ్య కూడా అన్ని నేను చేసుకుంటాను అమ్మ అని అంటుంది. నువ్వు వెంటనే స్నానం చేసి వస్తే.. కదా అంటున్నాను నేను నీకు జడ వేస్తాను లేదంటే మాత్రం నిన్ను తమ్ముడుతో ఆడుకొని ఇవ్వను అని ఆ మాట అనగానే నేను తమ్ముడు చూసి వస్తాను నువ్వే రెడీ చేయిపిని అని అంటుంది..
ఉదయం లేచిన తర్వాత పల్లవి చక్రధర్ కాఫీ తాగుతుంటే అక్కడికి వచ్చి కాఫీ కావాలి ప్రమితి అని అడుగుతుంది. అయితే ఇదంతా మానేస్తే మంచిది అని చక్రధర్ అంటాడు. ఇప్పటికైనా నువ్వు మారిపోతే మంచిది అని చక్రధర్ అంటాడు. అసలు నిన్న రాత్రి అయితే నా వల్లే అంతా ఇంట్లో జరుగుతుంది అని అంటున్నాడు కదా నేనే ఏదో ఒకటి చేస్తే మంచిది అని చక్రధర్ వార్నింగ్ ఇచ్చిన కూడా అసలు పట్టించుకోకుండా పల్లవి ఆరాధ్యను కిడ్నాప్ చేయించాలని అనుకుంటుంది. .
అవని ఏ పని చేయకూడదు అని అన్ని పనులు శ్రేయ అలాగే పార్వతీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అవని అక్కడికి వచ్చి అత్తయ్య మీకోసం జ్యూస్ తీసుకు రమ్మంటారా అని అడుగుతుంది. నువ్వు నా కోసం ఏమి చేయద్దమ్మా శ్రేయ చేస్తుంది. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో చాలు అని పార్వతి అంటుంది. అయితే అప్పుడే శ్రేయ అక్కడికి తీసుకొని వస్తుంది. ఇలాంటి రాజభోగాలు మా కాలంలో కూడా నాకు లేవు అని అవనిని అవమానించేలా మాట్లాడుతుంది భానుమతి.. అవినీతి ఎంత అదృష్టం కలిసి వచ్చిందో.. పల్లవి కేసు పెట్టినప్పుడు మీకు తెలీయలేదా అత్తయ్య.. పల్లవి వల్ల కమ్మలు అవని అరెస్టు అయ్యారు అప్పుడు మీరు ఏమి మాట్లాడలేదు అది మీకు మంచిగా అనిపించలేదా అత్తయ్య అని పార్వతీ సీరియస్ అవుతుంది.
అందరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంతమంది రౌడీలు వచ్చి ఇంట్లో నాన్న రచ్చ చేస్తారు. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. ఎవర్రా మీరు ఇంట్లో ఇంత రచ్చ చేస్తున్నారు ఎవర్రా మీరు అంటూ అందరు కంగారు పడిపోతూ ఉండగా పార్వతి అక్షయ్ శ్రీకర్ని పిలుస్తుంది. ఆ రౌడీలని కొట్టబోతే వాళ్లు వీళ్ళనే ఇంట్లో వస్తువులన్నీ కొట్టేసి కొడతారు. మంజుల వల్ల మరిది వచ్చి నా మనుషులే అని అనడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఎవరు వీళ్లంతా అని షాక్ అవుతారు. ఇక శ్రీకర్ అవనికి మొత్తం నిజం చెప్పడంతో అలాంటి మోసగతే ఊర్లోనే ఆస్తులు అమ్మాలని ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్లి వెతికితే కచ్చితంగా దొరుకుతుంది అని అవని అంటుంది.
స్కూల్లో నుంచి ఆరాధ్య బయటకి రాగానే కొందరు వ్యక్తులు వచ్చి ఆరాధ్యను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. అయితే డ్రైవరు ఎంతగా ప్రయత్నించినా సరే వాళ్ళు ఎవరో తెలియకుండానే ఉంటారు ఇక డ్రైవరు అవినీకి ఫోన్ చేసి ఆరాధ్యని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తాడు. ఆ విషయం వినగానే అవని ఒక్కసారిగా భయపడిపోతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది పల్లవి నీది కచ్చితంగా చేసి ఉంటుంది అని అవని అలాగే పార్వతి ఇద్దరూ అనుకుంటారు. అయితే పల్లవి సంగతి నేను చూసుకుంటాను అని అవని అంటుంది.
అవని నేను పల్లవి దగ్గరికి వెళ్లి తేల్చుకుంటాను అని చెప్తుంది. అయితే పల్లవి దగ్గరికి వెళ్లి ఆరాధ్య కనిపించడం లేదు ఎక్కడ దాచావు అని అడగగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. అయితే పల్లవి నాకు తెలీదు నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను నాకేం అవసరం అని ఎంతగా చెప్తున్నా సరే.. ఇక అప్పుడే అవనికి పార్వతి ఫోన్ చేసి ఆరాధ్య ఇంటికి వచ్చేసింది అని చెప్పగానే పల్లవి నిజంగానే కిడ్నాప్ చేయలేదు అని అందరూ అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..
Also Read : బుధవారం టీవీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..