Jagan Comments on Chandrababu: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘హత్య చేసినవాళ్లు ఎవరు..? చేయించినవాళ్లు ఎవరు? ప్రతి చోట ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు.
ఎన్నికలు అయిపోయిన తరువాత చిన్నపిల్లలను మోసం చేశాడు. తల్లికి వందనం అని చెప్పి చివరకు పంగనామం పెట్టాడు. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం చేశాడు. జగన్ అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి డబ్బులు పడేవి. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన చేస్తున్నారు.
చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఊర్లలో ఆధిపత్యం కోసం టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.
Also Read: వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా
అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా.. లేదా? సీతారామాపురంలో ఆధిపత్యం కోసం దాడులు చేశారు. తుపాకులు, కర్రలు, రాడ్లతో అరాచకాలు సృష్టించారు. బూత్ ఏజెంట్ గా కూర్చున్నాడని చంపేశారు. చంపినవాళ్లను పోలీసులు పట్టుకోలేదు. చంపినవాళ్లు ఊరు నుంచి వెళ్లిపోవడానికి పోలీసులు సహకరించారు.
చంద్రబాబు, లోకేష్ అండదండలతో ఎస్ఐ సమక్షంలో నరికేశారు. సుబ్బారాయుడు భార్యపైనా దాడి చేశారు. దాడి జరుగుతుంటే పోలీసులు ఆపలేదు. హత్య చేసిన తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అంటూ జగన్ మండిపడ్డారు.