BigTV English

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

AP Liquor Case: ఏపీ లిక్కర్ కుంభకోణం క్లయిమాక్స్‌కి చేరిందా? సిట్ అధికారులు న్యాయస్థానంలో ఏం చెప్పారు? మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అప్రూవర్‌గా మారారా? ఈసారి ఎవరికైనా నేరుగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఏపీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు. ఈ క్రమంలో కొన్ని విషయాలు ఆయన బయట పెట్టినట్టు తెలుస్తోంది. తాను తప్పు చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారాయన.

సిట్ అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పానని శనివారం మీడియాతో ముందు ప్రస్తావించారు. ఈ కేసులో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఒకటి రెండుసార్లు లిక్కర్ పాలసీపై ఆయన అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో ఆయన అప్రూవర్‌గా మారినట్టు చెబుతున్నారు. అదే జరిగితే అధినేత మెడకు ఈ కేసు చుట్టుకోవడం ఖాయమని అంటున్నారు.


ఈ కేసులో కీలక నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పల బెయిల్ పిటిషన్ విషయంలో సిట్ కొన్ని విషయాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. దర్యాప్తు పూర్తి అయ్యిందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వలేమంటూ  నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ లెక్కన మాజీ మంత్రి అప్రూవర్‌గా మారినట్టేనని అంటున్నారు.

ALSO READ: ఎమ్మెల్యే దగ్గుబాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. తరలివచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

అదే జరిగితే అంతిమ లబ్దిదారులు చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లే. ప్రస్తుతం నిందితులు ఇచ్చిన సమాచారాన్ని మరోసారి క్రోడీకరించే పనిలో నిమగ్నమైంది సిట్. అంతిమ లబ్దిదారుడికి నేరుగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  సిట్ నోటీసు ఇవ్వగానే హైకోర్టు‌ను ఆశ్రయిస్తారు. సిట్ వేసిన ఛార్జిషీటులో ఆనాటి సీఎంని చేర్చలేదు. కాకపోతే పలుమార్లు ప్రస్తావించింది.

లిక్కర్ వ్యవహారంలో ఇప్పటికే జగన్ చుట్టూ ఉండే కోటరీని అరెస్టు చేసింది. ఎంపీల నుంచి ఆ శాఖ మంత్రి వరకు విచారణ చేసింది. కాకపోతే ఓ ఎంపీని అరెస్టు చేసింది. మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారించింది. నేరుగా అంతిమలబ్దిదారుడి ఎవరో పని తేల్చేపనిలో పడిందట సిట్. సెప్టెంబరులో మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల నుంచి అరెస్టు ఖాయమనే ప్రచారం సాగుతోంది.

Related News

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Big Stories

×