Vangaveeti Statue: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీలకు అవకాశం లేదు. ఏడాది తర్వాత రకరకాల రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అనుకోకుండా జరిగిందా? ప్రభుత్వానికి మచ్చ తేవాలని వెనుక నుంచి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
రెండురోజుల కిందట కైకలూరు నియోజవర్గంలోని సానరుద్రవరంలో కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహానికి పేడ పూశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మరో గ్రామంలో రంగా విగ్రహానికి పేడ పూసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అర్ధరాత్రి రెండు గ్రామాల్లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తి చేతిలో బకెట్ పట్టుకుని రంగా విగ్రహం వద్దకు వచ్చాడు. అటు ఇటు చూసి ఎవరూ లేరని భావించి విగ్రహంపైకి ఎక్కాడు. ఈలోగా బకెట్‌తో తెచ్చిన పేడను ఆ విగ్రహంపై జల్లి అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకున్నాడు. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
ఆ రోజు రాత్రి ఏయే గ్రామాల మధ్య గొడవలు జరిగాయి. వారిలో రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారా? ఉంటే వారు ఏ పార్టీకి చెందినవారు? అదే సమయంలో అర్థరాత్రి ఆ ఏరియాలో తిరిగిన వ్యక్తి ఎవరు? అనేదానిపై సైలెంట్‌గా కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. ఎందుకంటే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.
ALSO READ: బీజేపీకి దగ్గరైతే జగన్ సక్సెస్ అవుతాడా?
విగ్రహానికి పేడ పూసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.
ఇటీవల రాజకీయంగా జరిగిన పరిణామాలను గమనించిన కూటమి నేతలు, దీనివెనుక వైసీపీ వారు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి గగ్గోలు పెడుతోందని, ఢిల్లీలో సైతం ధర్నాలు చేసిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఈ వాదనను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ నిందితుడు పట్టబడితే దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై తీగలాగే పనిలోపడ్డారు పోలీసులు. మొత్తానికి ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
వంగవీటి విగ్రహానికి పేడ.. బయటికొచ్చిన సీసీ టీవీ పుటేజ్
కైకలూరు నియోజవర్గం కలిదిండి మండలం సానరుద్రవరంలోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పేడ పూసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సీసీ ఫుటేజీ
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడిన… https://t.co/KB3MYuhP8K pic.twitter.com/8dx8YKSx5G
— BIG TV Breaking News (@bigtvtelugu) August 24, 2025