Upasana Konidela: ఉపాసన కొణిదెల(Upasana Konidela) పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలిగా రామ్ చరణ్(Ramcharan) సతీమణిగా అందరికీ సుపరిచితమే. అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్ గా అపోలో బాధ్యతలను చూసుకుంటున్న ఉపాసన ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ కో హబ్ వైస్ చైర్పర్సన్ గా కూడా నియమితులయ్యారు. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిగా బిజినెస్ ఉమెన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా “ఖాస్ ఆద్మీ పార్టీ ” (Khaas Aadmi party)గురించి తన ఆలోచన విధానాలను అభిమానులతో పంచుకున్నారు.
కీర్తి ,సంపద.. హోదా కాదు..
ఈ సందర్భంగా ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా ఖాస్ఆద్మీ పార్టీ గురించి తెలియజేస్తూ.. ఒక వ్యక్తిని నిజంగా ‘ఖాస్’ (ప్రత్యేకమైనది) చేసేది ఏమిటో ప్రతిబింబిస్తుంది. సంపద, హోదా లేదా కీర్తి కంటే స్వీయ-విలువ, ఒకరి పట్ల చూపించే దయ ఒక వ్యక్తిని నిజమైన ఖాస్ గా నిలబెడుతుందని ఉపాసన తన అభిప్రాయాలను కూడా వెల్లడించారు. నేటి సమాజంలో ఉన్న ప్రజలు వారి మనస్తత్వం వారి స్వభావిక లక్షణాలు కంటే కూడా బాహ్య లక్షణాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అది సరైనది కాదని ఉపాసన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎంతో ఒత్తిడి.. బాధను అనుభవించా..
ఇక తాను కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడ్డాను అంటే అది తన తండ్రి కుటుంబం నుంచి వచ్చిన వ్యాపార వారసత్వం నుంచి కాదని అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లడం ప్రముఖ నటుడు రామ్ చరణ్ వివాహం చేసుకోవడం వల్ల నేను ఖాస్ అవ్వలేదని తెలిపారు. ఈరోజు నేను ఇలా గుర్తింపు పడ్డాను అంటే దాని వెనుక ఎంతో ఒత్తిడి, బాధను అనుభవించాను. ఎలాగైనా జీవితంలో ఎదగాలని తపనపడ్డాను అందుకే ఈరోజు నేను ఖాస్ (ప్రత్యేకంగా) గా నిలబడ్డానని ఉపాసన తెలియజేశారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నోసార్లు నన్ను నేనే అవమానించుకున్నాను, ఎన్నోసార్లు కింద పడ్డాను.. పడుతూనే ఉన్నాను.. పడిన ప్రతిసారి పైకి లేచి నిలబడ్డాను మళ్లీ మళ్లీ నేను నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే కష్టపడ్డానని అందుకే నేను ఖాస్ అయ్యాను అంటూ ఉపాసన వెల్లడించారు.
ఇలా ఒక మహిళ తనని తాను ప్రత్యేకంగా నిరూపించుకోవడమే అసలైన ఖాస్ ఆద్మీ పార్టీ అంటూ ఉపాసన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఉపాసన రాంచరణ్ సతీమణిగా అందరికీ సుపరిచితమే 2012 వ సంవత్సరంలో ఈ జంట పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇలా వివాహం తర్వాత ఉపాసన తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా నిలుస్తున్నారు. ఇక ఈమె గత రెండు సంవత్సరాల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉపాసన అందరితో పంచుకోవడమే కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకమైన పోస్టులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Also Read: Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?