Madharaasi Trailer: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ శిఖర స్థాయిలో ఉంది. ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాను మిగతా ఇండస్ట్రీలు చూసే రేంజ్ మారిపోయింది. బాహుబలి సినిమా వచ్చిన తర్వాతే చాలామంది పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
సౌత్ సినిమా ఇండస్ట్రీను తాకడానికి నార్త్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ నానా కష్టాలు పడుతుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాదే ప్రథమ స్థానం. బాహుబలి, పుష్ప , కల్కి వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చూపాయి. ఈ తరుణంలో ఏఆర్ మురగదాస్ ఒక తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ సినిమాలు ఎంటర్టైన్ చేస్తాయి అని మాట్లాడారు. తమిళ సినిమాలు ఎడ్యుకేట్ చేస్తాయి అన్నారు.
అసలు ఇదేమి ట్రైలర్
తమిళ సినిమాలు ఎడ్యుకేట్ చేస్తాయి అనేది వాస్తవమే, కానీ మునుపెన్నడో తెలుగు సినిమా ఎడ్యుకేట్ చేసినతగా ఏ ఇండస్ట్రీ ఎడ్యుకేట్ చేయలేదు. ఒక స్వాతి కిరణం, స్వాతిముత్యం, సప్తపది, బడిపంతులు, దానవీరశూరకర్ణ వంటి ఎన్నో సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. తెలుగు సినిమా కథలు, తెలుగు పుస్తకాలు చదివి మిగతా ఇండస్ట్రీ వాళ్ళు సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇంత అవగాహన కూడా లేకుండా మురగదాస్ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న మదరాశి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ కొంచెం కూడా ఆకట్టుకోలేదు. ఈ తరుణంలో మురగదాస్ ఏమి ఎడ్యుకేట్ చేశావు అని చాలామంది సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు.
మాటలు జాగ్రత్త
మురగదాస్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తను తీసిన గజినీ సినిమా ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలానే తమిళంలో తీసిన రమణ అనే సినిమా తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ అయింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ అనే సినిమాను కూడా చేశాడు మురగదాస్. ఆ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా ఒక రకంగా బానే ఆడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు మురగదాస్, శివ కార్తికేయన్ సినిమా వస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న తరుణంలో ఇలాంటి కామెంట్స్ అనేవి సినిమాకు ఎఫెక్ట్ అవుతాయి.
Also Read: Cm Revanth Reddy: కార్మికుల వ్యవహారంలో వీటిని పాటించండి… సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్