Sir Madam Movie: ఏ ఇండస్ట్రీ అయినా కూడా స్టార్ డం అనేది కొంతమేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఒక సినిమా ఆకట్టుకోవాలి అంటే కచ్చితంగా కథ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముక్కు మొహం తెలియని నటులు చేసిన సినిమాలు కూడా తారాస్థాయిలో హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని నటులు ఎవరికి పరిచయం లేదు. కానీ ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతో చాలామంది నటులకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమాకి కథ హీరో. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి.
ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చూసే ప్రేక్షకులు ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూడటం మొదలుపెట్టారు. ఓటిటి ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రతి సినిమా చూడటానికి అవకాశం దొరికింది. అయితే కొంతమంది చిన్నపిల్లలు సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది వాస్తవం. కానీ సినిమాని సినిమాలా చూసే ప్రేక్షకులు కొంతమంది ఉంటారు. వాళ్లకు మాత్రం ఓటిటి ప్లాట్ఫామ్స్ అనేవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి.
100 కోట్ల మార్కెట్
విజయ్ సేతుపతి నిత్యామీనన్ కలిసి నటించిన సినిమా సార్ మేడం. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇద్దరూ తెలుగు యాక్టర్స్ కాకపోయినా కూడా తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. దీనికి కారణం కథలో ఉన్న కంటెంట్. ఈరోజుల్లో ఒక సినిమా 100 కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ సబ్జెక్టు విపరీతంగా ప్రేక్షకులకు ఎక్కితే కానీ బ్రహ్మరథం పట్టరు. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలామందికి విపరీతంగా కనెక్ట్ అవడం వలన ఈ సినిమాకి ఆడియన్స్ అందరూ బ్రహ్మరథం పెట్టారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి ఎంచుకునే కథలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనడానికి ఈ సినిమా కూడా ఒక నిదర్శనం.
Also Read: Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది