Cm Revanth Reddy: తెలుగు సినిమా పరిశ్రమంలో గత కొన్ని రోజులుగా సినిమా కార్మికులు తమ వేతనాలు పెంచాలి అంటూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాతలు ఇవ్వాల్సిన దానికంటే ఇప్పటికే ఎక్కువ ఇస్తున్న మళ్లీ 30% అంటే మా వల్ల కాని పని అంటూ వాళ్ల వెర్షన్ చెప్పారు. ఇదొక రెండు మూడు రోజుల్లో తెగిపోయే వివాదం అనుకుంటే దాదాపు 17 రోజులు పాటు సాగింది.
కొన్ని రోజులు పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. నిన్నటితో షూటింగ్ లన్ని మొదలయ్యాయి. ఈ తరుణంలో సమస్యలన్నీ తీరిపోయాయి అని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అయితే నేడు సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా నిర్మాతలతోను దర్శకులతోను ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా కీలకమైన అంశాలను దర్శక నిర్మాతలతో తెలిపారు.
వీటిని పాటించండి
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక విషయాలను తెలిపారు.
సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమ లో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం . తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలంగాణ లో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమ లో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమ లో నిర్మాతలు,కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయం లో నిర్మాతలు మానవత్వం తో వ్యవహరించాలి. నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది.
కార్మికులు కోసం ప్రభుత్వం
సినీ కార్మికులను,నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు.
అందరూ చట్ట పరిధి లో పని చేయాల్సిందే.పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటాను. హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది.తెలుగు సినిమా ల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి.అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే నా ధ్యేయం. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు దర్శక,నిర్మాతలతో మాట్లాడారు.
Also Read: Sir Madam Movie: 100 కోట్లు మార్కెట్ సార్, ఇది కంటెంట్ కి ఉన్న పవర్