OTT Movie : ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా, ఎమోషనల్ స్టోరీతో ఆకట్టుకుంటోంది. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమాలో, ఒక సీరియల్ కిల్లర్ నొప్పి లేకుండా మనుషులను చంపుతుంటాడు. ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? అతని గతం ఏమిటనేదే ఈ స్టోరీ. ఈ సినిమా సస్పెన్స్ ట్విస్టులతో ఉత్కంఠభరితంగా నడుస్తుంది. తొందరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళ్తే
శివగామి ఒక వితంతువు. క్యాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్న ఒక తల్లి. ఈ తట్టుకోలేని తీవ్రమైన నొప్పితో బాధపడుతూ, తన కొడుకు భువనేష్‌ను మెర్సీ కిల్లింగ్ కోసం వేడుకుంటుంది. ఆమె బాధను చూసి నిస్సహాయంగా ఉన్న భువనేష్, తన తల్లి వేదనను అర్థం చేసుకుని ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. అతను తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న ఇతర రోగులకు కూడా మెర్సీ కిల్లింగ్ అందించడం ప్రారంభిస్తాడు. దీనిని అతను నీతిగా సరైనదిగా భావిస్తాడు. అయితే అదే సమయంలో, ముగ్గురు యువతులు ఒక అపార్ట్ మెంట్ లో హత్యకు గురవుతారు. ఇవి భువనేష్ చేసినట్టు కనిపిస్తాయి. ఈ హత్యలు స్థానికంగా ఒక గందరగోళాన్ని సృష్టిస్తాయి.
ఇన్‌స్పెక్టర్ రఘురామ్ ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. రఘురామ్ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, అతను షాకింగ్ రహస్యాలను వెలుగులోకి తెస్తాడు. భువనేష్‌ను అరెస్టు చేసినప్పుడు, కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. క్లైమాక్స్ ఒక ఎమోషన్ ట్విస్ట్ తో ముగుస్తుంది. భువనేష్ కి, అమ్మాయిల హత్యలకు సంబంధం ఏమిటి ? ఇన్‌స్పెక్టర్ రఘురామ్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Aha Tamil లో
‘సైలెంట్’ (Silent) గణేశ పాండి దర్శకత్వంలో రూపొందిన తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఇది 2024 నవంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో గణేశ పాండి, సమయ మురళి, ఆరాధ్య, మురళి రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే Aha Tamil లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
Read Also : దేవుడి కోసం వెళ్లి దెయ్యానికి బలి… ముసలాడితో అమ్మాయిలు అడ్డంగా బుక్… మోస్ట్ కాంట్రవర్షియల్ హర్రర్ మూవీ