E-Paper
Advertisement

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Jagan: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా హింసకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘటనలు ఈ అంశాన్ని నిర్థారిస్తున్నాయని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో కూడా హింసకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు హింసకు పాల్పడడం ఎక్కడా చూడలేదని, పోలీసులను వినియోగించుకుని దారుణాలను పాల్పడుతున్నారని చెపపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే శగా గొప్పగా పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మాజీ సీఎం జగన్, పార్టీకి చెందిన ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు, హింసపై చర్చించారు. ఎన్నికల్లో అక్రమాలు, హింసను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవడంతో ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది-జగన్

క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలపై ఆధారాలు సేకరణ చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. పార్టీ నాయకులకు ఈ విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని, పటిష్ట ఆధారాలను కోర్టుల ముందు ఉంచడం ద్వారా న్యాయ పోరాటం చేద్దామని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాటం చేద్దామని నేతలతో అన్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ: కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

Related News

కడప జిల్లా నందలూరులో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత?

పొన్నలూరులో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర దాడి!

ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం

సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా.. సీఎం చంద్రబాబుతో పవన్ అరగంట భేటీ, అసలు మేటరేంటి?

కూటమి మధ్య జెడ్పీ పీఠాలు పంపకాల మాటేంటి? ఈ సాయంత్రానికి ఓ కొలిక్కి, కిందిస్థాయిలో అయితే

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు

కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే..

Big Stories

Advertisement
×