E-Paper
Advertisement

మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తా.. జగన్ కీలక ప్రకటన

మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తా.. జగన్ కీలక ప్రకటన
Advertisement

Jagan In Visakha: చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. బోటు ప్రమాదం ఘటనపై ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. బోటు ప్రమాదం జరిగిన వెంటనే సర్కార్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు రైజ్ చేశారు. విశాఖలోని జబ్బర్‌తోటలోని బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను మంగళవారం పరామర్శించారు మాజీ సీఎం.

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ రుసరుస-బోటు ప్రమాదం గురించి బాధిత కుటుంబాల నుంచి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జగన్‌,  జూలై ఒకటిన ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారని, కేవలం పది మైళ్ల దూరంలో  ఘటన  జరిగిందన్నారు. జులైన 4న ఓ వ్యక్తి ఫోన్‌ చేసి వస్తున్నామని చెప్పాడని, కాసేపటికే మత్య్సకారుల బోటు ప్రమాదానికి గురైందన్నారు. ఈ ఘటనపై ఫిషరీస్‌ అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.

Advertisement

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ-బోటు ప్రమాదం గురించి ఆ రోజు రాత్రి 10.30 లకు కలెక్టర్‌, మెరైన్‌ సీఐకి సమాచారం ఇచ్చారన్నారు. వెంటనే అధికారులు స్పందిస్తే మత్స్యకారులు దొరికేవారని అన్నారు. కోస్ట్‌గార్డ్‌ టీమ్ అప్రమత్తం అయితే ఐదుగురైనా బతికేవారని వివరించారు. 5న చైనా బోటు  సిబ్బంది చిన్నాను కాపాడారని, తప్పుడు జరిగింది కాబట్టే త్రీమెన్‌ కమిటీ వేశారని తేల్చిచెప్పారు.

త్రీమెన్‌  కమిటీ నివేదిక తప్పుల తడక-ఆ కమిటీ నివేదిక అంతా తప్పుల తడకగా వర్ణించిన జగన్, చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా? ‌ ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు లేరని, ఉత్తరాంధ్ర మంత్రులు రాలేదన్నారు. కనీసం బాధితులను ఫిషరీష్‌ మంత్రి పరామర్శించలేదన్నారు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా?

Advertisement

ఎక్స్‌ గ్రేషియా కింద అరకొర సాయం చేశారని, కోటి చొప్పన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడుగురు మత్స్యకారులకు కుటుంబాలకు పరిహారం అందాలని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెలలోపు ఆదుకుంటామని చెప్పారు. మా ప్రభుత్వంలో మత్స్యకారులకు భరోసా ఉండేదని, పాక్‌లో చిక్కుకున్న మత్స్యకారులను తీసుకొచ్చిన ఘనత మా ప్రభుత్వానిదేనని  గుర్తు చేశారు.

ALSO READ: తాళికోట యుద్ధంలో ఊహించని దారుణం.. శతాబ్దాల వైభవాన్ని మంచులా కరిగించిన ఆ ఇద్దరు ఎవరు?

సీదరి అప్పలరాజు కొడుకుపై జగన్ మాట-ఇవాళ బాధిత కుటుంబాలు మీడియా ముందు ఎందుకు నిలబడ్డారు, జరిగిన అన్యాయం గురించి మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.  అదే సమయంలో సీదరి అప్పలరాజు కొడుకు కేసు గురించి ప్రస్తావించారు.

మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల కొడుకని, బైక్ నడుపుతూ  గుద్దితే  ఓ వ్యక్తి చనిపోయాడని వివరించారు. ప్రమాదాలు జరుగుతాయని చేసిందని కరెక్టు అని తాను చెప్పలేనని,  సిదిరి అప్పలరాజు కొడుకుపై మర్డర్ కేసు పెట్టి ఇరికించాలని ప్లాన్ చేసిందన్నారు. ఆ పిల్లోడికి ఏం తెలుసు? నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు.

 

 

 

Related News

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×