Jagan On Accidents: మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి వైసీపీ అధినేత, మాజీ జగన్ మీడియాకు మసాలా ఇచ్చేస్తున్నారు. ఆయన మాటలను ట్రోల్ చేయడం నెటిజన్ల వంతైంది. విశాఖ వచ్చిన జగన్ పడవ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ ఘటన బాధితులంతా మత్యృకారుల కుటుంబాలు కావడంతో పనిలో పనిగా సీదిరి అప్పలరాజు కొడుకు అరెస్ట్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.
మళ్లీ మీడియాకు మసాలా ఇచ్చిన జగన్- ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లు గడిచిపోయింది. వైసీపీ తీరు ఏ మాత్రం మారలేదు. వేర్వేరు కేసుల నిందితులను వెనక వేసుకురావడం, వారిని పరామర్శించడం చేస్తున్నారు జగన్. ఇప్పుడూ అదే చేస్తున్నారనుకోండి. అదే వేరే విషయం. బోటు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం విశాఖ వచ్చారు జగన్.
మత్యృకారుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. బాధితుల గురించి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. అదే సమయంలో సీదిరి అప్పలరాజు కూడా మత్యృకారుల కమ్యూనిటీకి చెందినవారు కావడంతో ఆయన కొడుకు యాక్సిడెంట్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దీని ద్వారా మత్యృకారులను వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
సీదిరి అప్పలరాజు కొడుకు కేసు తెరపైకి-మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పలాస ఎమ్మెల్యే అంటూ అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్లు ఉంటాయని, బైక్ నడుపుతూ గుద్దితే ఓ వ్యక్తి చనిపోయాడని వివరించారు. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, ఆ పిల్లాడు చేసింది కరెక్ట్ అని తాను చెప్పడం లేదన్నారు.
ఆ పిల్లోడికి ఏమి తెలుస్తుందని, ఒక్కోసారి జరుగుతాయని సమర్థించే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? అంటూ చెప్పుకొచ్చారు. 18 ఏళ్ల అబ్బాయిపై మర్డర్ కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి నిజంగా మానవత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు.
కాశీబుగ్గలో హిట్ అండ్ రన్ కేసు-అసలు సీదరి అప్పలరాజు కొడుకు కేసు ఏంటి? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 10న హిట్ అండ్ రన్ కేసు దుమారం రేపుతోంది. సూదికొండ గ్రామానికి చెందిన 45 ఏళ్ల గొర్రెల కాపరి దానయ్యను సీదరి అప్పలరాజు కొడుకు నడుపుతున్న బైక్ ఢీకొట్టింది. ఆ వ్యక్తి స్పాట్‌లో మృతి చెందాడు. జులై 13న నిందితుడు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి కొడుకు అరవ్ బదులు మరొక వ్యక్తి లొంగిపోయాడు.
ALSO READ: నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్‌పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!
ఆ రోజు రాత్రి 10 గంటల వరకు విచారించారు పోలీసులు. ప్రమాద వివరాలు, సీసీటీవీ ఆధారాలు పరిశీలించిన పోలీసులు, ప్రమాదం సమయంలో మాజీ మంత్రి కొడుకు బైక్ నడుపుతున్నట్లు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత అప్పలరాజు తన కొడుకుని అక్కడి నుంచి తప్పించారు. కారులో ఆసుపత్రికి సీదిరి అప్పలరాజు వెళ్లిన ఫుటేజ్ పోలీసులకు చిక్కింది.
ప్రమాదం తర్వాత వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ కుమారుడు సిద్ధార్థ్‌పై తాను బైక్ నడిపానని సరెండర్ అయ్యాడు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు కాశీబుగ్గ పోలీసులు. సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన కొడుకు అరవ్, మరొక వ్యక్తి సిద్ధార్థ్‌పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు ఇద్దరు యువకులను తరలించారు.
'సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు.. బైక్ నడుపుతూ గుద్దితే ఓ వ్యక్తి చనిపోయాడు.
సిదిరి అప్పలరాజు కొడుకుపై మర్డర్ కేసు పెట్టారు
ఆ పిల్లోడికి ఏం తెలుసు? .. నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?'
– వైఎస్ జగన్#YSJagan #PalasaAccident #SeediriAppalaraju #APPolitics #YSRCP pic.twitter.com/AwxOCkTDp6
— BIG TV Breaking News (@bigtvtelugu) July 14, 2026