E-Paper
Advertisement

కరెంట్ ఉండదు.. బ్యాటరీతో పనిలేదు.. కానీ ఈ ‘మాయా దీపాలు’ ఎలా వెలుగుతాయి?

కరెంట్ ఉండదు.. బ్యాటరీతో పనిలేదు.. కానీ ఈ ‘మాయా దీపాలు’ ఎలా వెలుగుతాయి?
Advertisement

Road Studs Mystery: రాత్రి వేళల్లో ప్రయాణిస్తునప్పుడు రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో పసుపు, ఎరుపు లేదా తెలుపు రంగుల్లో మెరుస్తూ చిన్న చిన్న వస్తువులు కనిపిస్తుంటాయి. వాహనాల లైట్లు పడగానే ఇవి విద్యుత్ దీపాల కంటే ప్రకాశవంతంగా వెలుగుతాయి. అయితే ఎలాంటి విద్యుత్ సరఫరా లేకుండా, బ్యాటరీ కనెక్షన్ ఇవ్వకుండా ఇవి ఏ విధంగా మెరుస్తున్నాయి? అన్న ప్రశ్న ఎప్పుడోకప్పుడు కలిగే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

ఇంతకీ ఆ మెరిసే వస్తువులేంటి?

రోడ్డుపై అమర్చే ఈ చిన్న పసుపు రంగు వస్తువులను సాంకేతిక భాషలో ‘రోడ్ స్టడ్స్’ (Road Studs) అంటారు. అదే విధంగా ‘రెట్రోరిఫ్లెక్టివ్ రోడ్ మార్కర్స్’ అని కూడా పిలుస్తారు. ఇక సాధారణ పరిభాషలో ‘క్యాట్స్ ఐస్’ (పిల్లి కళ్ళు) అని కూడా పలువురు పేర్కొంటూ ఉంటారు. రాత్రి వేళ పిల్లి కళ్లపై వెలుతురు పడినప్పుడు అవి ఎలాగైతే మెరుస్తాయో.. ఇవి కూడా అచ్చం అలాగే మెరుస్తాయి కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్పవచ్చు.

విద్యుత్ లేకుండా ఎలా వెలుగుతాయి?

Advertisement

రోడ్ స్టడ్స్.. విద్యుత్ లేకుండానే మెరవడం వెనుక.. ‘రెట్రోరిఫ్లెక్టివిటీ’ (Retroreflectivity) అనే సైన్స్ సూత్రం దాగుంది. సాధారణ అద్దంపై కాంతి పడినప్పుడు అది వేరే దిశలోకి పరావర్తనం (Reflect) చెందుతుంది. కానీ ఈ క్యాట్స్ ఐస్ లోపల ప్రత్యేకమైన ప్రిజమ్‌లు లేదా మైక్రోస్కోపిక్ గ్లాస్ బీడ్స్ (గాజు పూసలు) ఉంటాయి. వాహనాల హెడ్‌లైట్ల నుంచి వచ్చే కాంతి వీటిపై పడినప్పుడు ఆ కాంతి ఏ దిశ నుంచి అయితే వచ్చిందో సరిగ్గా అదే దిశకు తిరిగి ప్రయాణిస్తుంది. దీనివల్ల డ్రైవర్‌కు ఆ వస్తువులు స్వయంగా వెలుగుతున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

సోలార్ ఆధారిత వేరియంట్లు

ప్రస్తుతం సాంకేతిక బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో కొన్ని దేశాల్లో సౌరశక్తితో నడిచే రోడ్ స్టడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై చిన్న సోలార్ ప్యానెల్, లోపల రీఛార్జబుల్ బ్యాటరీ, ఎల్ఈడీ బల్బులు ఉంటాయి. ఇవి పగటి పూట సూర్యరశ్ని ద్వారా ఛార్జ్ అయ్యి.. చీకటి పడగానే ఆటోమేటిక్ గా ఇందులోని ఎల్ఈడీ బల్బులు వెలగడం ప్రారంభిస్తాయి. ఇవి సొంతంగా వెలుతురును ఇవ్వడంతో పాటు.. కాంతిని సైతం పరావర్తనం చేయగలవు. సరిపడ సూర్యరశ్మి లేని రోజుల్లో.. పైన పేర్కొన్న వాటిలో సోలార్ రోడ్ స్టడ్స్ పనిచేస్తాయి.

వీటివల్ల ఏంటి ప్రయోజనం?

Advertisement

రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో ఈ స్టడ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయి. చీకటి పడినప్పుడు రోడ్డు మలుపులు, సరిహద్దులను గుర్తించడానికి ఇవి డ్రైవర్లకు దిక్సూచిలా మారుతున్నాయి. భారీ వర్షం, దట్టమైన పొగమంచు కురుస్తున్నప్పుడు.. ఈ స్టడ్స్ లైన్లను స్పష్టంగా చూపిస్తూ ప్రమాదాలను నివారిస్తున్నాయి. ఒక్కోసారి వాహనం ఈ స్టడ్స్ పై నుంచి వెళ్లినప్పుడు చిన్నపాటి కుదుపునకు లోనై.. డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యేందుకు కూడా సాయపడుతున్నాయి.

Also Read: బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం.. 54 మంది మృతి, రోడ్డున పడ్డ 6 లక్షల మంది

ఏ రంగు స్టడ్.. దేని కోసం?

ఈ రోడ్ స్టడ్స్ ను రంగుల ఆధారంగా రోడ్డుపై అమరుస్తుంటారు. ఎరుపు రంగు స్టడ్ తీసుకుంటే.. ప్రమాదకర అంచులు, లోయలు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికగా వీటిని వాడుతుంటారు. తెలుపు రంగును ఒకే దిశలో వెళ్లే లేన్లను వేరు చేయడానికి ఎక్కువగా వినియోగిస్తారు. అటు పసుపు రంగును రహదారి మధ్యలో ఉండే విభజన రేఖలను సూచించడానికి వాడుతుంటారు. మెుత్తంగా రోడ్డుపై ఉన్న ఈ చిన్నపాటి క్యాట్ ఐస్.. కోట్లామంది ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానం చేరేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు అర్థంమవుతోంది.

Also Read: ఇప్పుడంటే బిర్యానీ ఫేమస్.. పూర్వం హైదరాబాదీలు ఇష్టంగా తిన్న ఫుడ్ ఏది? మీ ఊహకు సైతం అందదు!

Related News

అమెరికాలో సెటిల్ అవ్వాలంటే.. ఈ 5 రాష్ట్రాలు బెస్ట్.. ఎందుకంటే?

కుతుబ్ షాహీల కాలం నాటి రహస్య కోట.. నేటి ఐటీ హబ్.. దుర్గం చెరువుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

10 వేల ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టే ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా ఈ సోలార్ రైలు ఎక్కాల్సిందే!

గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?

ఊసరవెల్లిలా రంగులు మార్చే పర్వతం..నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం!

హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి నీళ్ల కోసం క్యూ.. ఏంటీ.. ఈ నల్లగొండ బావి ప్రత్యేకత?

వింత గ్రామం.. ఏదీ తాకకూడదు, గుడిలో ప్రవేశం నిషేధం, రాత్రి బసచేయకూడదు

Big Stories

Advertisement
×